తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yuvraj Singh To Contest Ls Polls : లోక్​సభ ఎన్నికల్లో యువరాజ్​ సింగ్​ పోటీ?

Yuvraj Singh to contest LS polls : లోక్​సభ ఎన్నికల్లో యువరాజ్​ సింగ్​ పోటీ?

Sharath Chitturi HT Telugu

02 March 2024, 8:15 IST

google News
    • Yuvraj Singh latest news : 2024 లోక్​సభ ఎన్నికల్లో యువరాజ్​ సింగ్​ పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంపై తాజాగా ఆయన స్పందించారు.
లోక్​సభ ఎన్నికల్లో యువరాజ్​ సింగ్​ పోటీ?
లోక్​సభ ఎన్నికల్లో యువరాజ్​ సింగ్​ పోటీ?

లోక్​సభ ఎన్నికల్లో యువరాజ్​ సింగ్​ పోటీ?

Yuvraj Singh Lok Sabha elections : 2024 లోక్ సభ ఎన్నికల్లో యువరాజ్​ పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పంజాబ్​ గురుదాస్​పూర్ నుంచి బీజేపీ టికెట్​పై పోటీ చేసి, యువరాజ్​ తన రాజకీయ అరంగేట్రం చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్​ మీడియాలో వస్తున్న వార్తలకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా చెక్​ పెట్టారు. ఆ వార్తల్లో నిజం లేదని, తాను 2024 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. రాజకీయాల కన్నా ప్రజలకు సాయం చేయడమే తనకు ఇష్టం అని, ‘యువీకెన్​’ ఫౌండేషన్​ ద్వారా.. తన దాతృత్వ ప్రయత్నాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘటించారు 42ఏళ్ల యువరాజ్​ సింగ్​.

“లోక్​సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను పోటీ చేయడం లేదు,” అని ఎక్స్​లో పోస్ట్​ చేశారు టీమిండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​.

2024 Lok Sabha elections : “ప్రజలకు సా సాయశక్తుల సాయం చేయడంలోనే నా ప్యాషన్​ ఉంది. @YOUWECAN ఫౌండేషన్ ద్వారా నేను దానిని కొనసాగిస్తాను. మన శక్తి మేరకు కలిసి మార్పును కొనసాగిద్దాం,' అని యువరాజ్​ సింగ్​ పేర్కొన్నారు.

గురుదాస్​పూర్ నుంచి యువరాజ్ సింగ్ బీజేపీ టికెట్​పై పోటీ చేస్తారని పలు మీడియా కథనాలు బయటకి వచ్చాయి.

భారత మాజీ క్రికెటర్ యువరాజ్​ సింగ్, తన తల్లి షబ్నమ్ సింగ్​తో కలిసి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రవేశంపై విపరీతంగా చర్చలు జరిగాయి. గురుదాస్​పూర్​ నుంచి ఆయన పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగాయి.

Yuvraj Singh latest news : గురుదాస్​పూర్ నుంచి సెలబ్రిటీ అభ్యర్థులను బరిలోకి దింపిన చరిత్ర బీజేపీకి ఉంది. యువరాజ్ సింగ్ అభ్యర్థిత్వంపై వస్తున్న ఊహాగానాలను ఇది మరితం బలం చేకూర్చింది. ఫలితంగా.. ఈ వార్తపై జోరుగా చర్చలు సాగాయి.

2019 లోక్​సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖ బాలీవుడ్​ నటుడు సన్నీ డియోల్.. కాంగ్రెస్​ సిట్టింగ్​ ఎంపీ సునీల్ జాఖర్​ను ఓడించారు. ఆ తర్వాత.. 2022 మేలో జాఖర్ బీజేపీలో చేరారు.

సన్నీ డియోల్ విమర్శలు..

Yuvraj Singh political entry : కొన్ని రోజుల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. సన్నీ డియోల్ తన నియోజకవర్గంలో కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. గురుదాస్​పూర్ నుంచి ఎన్నికైనప్పటికీ బీజేపీ ఎంపీకి పఠాన్​కోట్​కు సంబంధించి ఏ విషయం కూడా ఆయనకు ఇంకా తెలియదని ఆరోపించారు. రాజకీయాలంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటమని గుర్తుచేశారు.

అంకితభావంతో రాష్ట్రానికి సేవలందిస్తున్న నాయకులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని మన్ అన్నారు. బయటి వ్యక్తులను కాకుండా.. రాష్ట్రంలో ప్రజాసేవకు అంకితమైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

తదుపరి వ్యాసం