Self Attack For Security: గన్‌మెన్ కోసం హత్యాయత్నం డ్రామా..బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Self Attack For Security: గన్‌మెన్ Gunmen కోసం బీజేపీ Bjp Leader నాయకుడు చేసిన హత్యాయత్నం డ్రామా బెడిసి కొట్టింది. తనకు తానే దాడికి ప్లాన్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలడంతో కేసు నమోదు చేశారు.
Self Attack For Security: చుట్టూ గన్‌మెన్‌లతో జనంలో షో చేద్దామనుకున్న బీజేపీ నాయకుడి డ్రామాను పోలీసులు కనిపెట్టారు. హత్యాయత్నం జరిగితే ప్రాణాలకు ముప్పు ఉందనే కారణంతో గన్‌మెన్ కేటాయిస్తారని అతి తెలివితో ఆలోచించాడు. అందుకు తన మీద తానే అటాక్ చేయించుకున్నాడు. సుపారీ ఇచ్చి దాడికి ప్లాన్ చేయించుకుని గగ్గోలు పెట్టాడు. బీజేపీ నాయకుడు ఆడిన డ్రామాను హైదరాబాద్ పోలీసులు కనిపెట్టేవారు.
హైదరాబాద్‌కు చెందిన బీజేపీ నాయకుడు Bhaskar goud గన్‌మెన్ కోసం పోలీసుల్ని బురిడీ కొట్టించాలని ప్రయత్నించి భంగపడ్డాడు. గతంలో పలు కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు ఉదయ్ భాస్కర్ గౌడ్‌పై ఇటీవల జరిగిన కత్తులతో దాడి కేసు దర్యాప్తులో ఊహించని మలుపు తిరిగింది. పోలీసులవిచారణలో కొత్త విషయాలు బయటకొచ్చాయి.
కొద్ది రోజుల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ్ భాస్కర్.. బీజేపీలో చురుగ్గా తిరుగుతున్నాడు. అతనిపై గతంలో క్రిమినల్ కేసులు ఉండటంతో గన్‌మెన్లను నేరుగా కోరితే ఇవ్వరని అటాక్ ప్లాన్ చేశాడు.
తనకు ప్రాణహాని ఉందని బిల్డప్ ఇవ్వడానికి తన మీద తానే హత్యాయత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత దాడి జరిగిందంటూ ఉప్పల్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసులు అసలు విషయం పసిగట్టారు. నిందితుడు భాస్కర్‌గౌడ్‌తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు.
బీజేపీ నాయకుడిగా చలామణీ అవుతున్న 'భాస్కర్‌గౌడ్ బోడుప్పల్‌లో Boduppal నివాసం ఉంటున్నాడు. సమాజంలో గుర్తింపు, పలుకుబడి కోసం తన మీద తానే మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు.
వెంట గన్‌మెన్‌లు ఉంటే సమాజంలో గౌరవం లభిస్తుందనే ఆలోచనతో ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి 24న ఉప్పల్ భగాయత్‌లో భాస్కర్‌గౌడ్‌పై దాడి జరిగింది. దాడి కోసం రూ.2.50 లక్షలతో కిరాయి మూకతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్‌గౌడ్‌పై హైదరాబాద్‌లో ఏడు కేసులు నమోదైనట్టు గుర్తించారు. దీంతో దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఉత్తుత్తి హత్యాయత్నం ప్లాన్‌కు సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టైల్‌లో విచారించడంతో అసలు నిజం కక్కేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని డీసీపీ పద్మజ తెలిపారు.
సినీ నిర్మాతగా, బీజేపీ హిందూ ప్రచార కమిటీ మెంబర్ గా వ్యవహరిస్తున్నాడని జనంలో పలుకుబడి కోసం తమపై మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడని డీసీపీ స్పష్టం చేవారు. రూ.2,50,000 చెల్లించి దాడి చేయించుకుని పోలీసులకు ఏమి తెలియనట్టు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
నిందితుల నుంచి ఇన్నోవా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు.