Weather update : అమ్మో ఎండలు- అక్కడ 45 డిగ్రీల ఉష్ణోగ్రత! ఈ రాష్ట్రాలకు అలర్ట్..
21 April 2024, 12:45 IST
Heatwave alert in India : వేసవి కాలంలో నేపథ్యంలో వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. పలు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ వివరాలు..
భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలు..
Telangana Heatwave alert : దేశంలో భానుడి భగభగలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎండలు, వడగాల్పులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల పాటు పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తుండటం.. మరింత ఆందోళనకు గురిచేస్తున్న విషయం. ఒడిశా, ఝార్ఖండ్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని చెప్పింది ఐఎండీ.
ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌లోని గంగా నదీ తీర ప్రాంతం, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడుల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ చెప్పింది. ఇక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో కూడా ఈసారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా వడగాల్పుల ప్రభావం..
ఒడిశాలో పరిస్థితులు ఇప్పటికే దారుణంగా ఉన్నాయి. బారిపదలో శనివారం.. 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఇక రాష్ట్రంలోని మరో 10 ప్రాంతాల్లో 43 డిగ్రీల మార్క్ దాటింది. అంతేకాదు.. వడగాల్పుల కారణంగా బాలాసోర్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Andhra Pradesh Heatwave alert : పశ్చిమ్ బెంగాల్‌లోని మిద్నాపూర్, బంకురలో 44.5, 44.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యయి. ఝార్ఖండ్‌లోని డాల్టన్‌గంజ్, జమ్షెద్‌పూర్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో 43.6, 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని రంజన్‌గావ్‌లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీ సెల్సియస్‌ని టచ్ చేశాయి.
బిహార్‌లోనూ వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలితంగా.. పట్నా యంత్రాంగం, స్కూల్స్ టైమింగ్స్‌ని మార్చింది. శనివారం నాడు.. బిహార్‌లోని 11 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటేశాయి. ఇంకొన్ని రోజుల పాటు ఇదే కొనసాగుతుందని ఐఎండీ చెప్పుకొచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు అన్ని ప్రాంతాలు వడగాల్పుల ఊబిలో చిక్కుకున్నాయి! ఇక్కడ కనీసం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
IMD Heatwave alert : మధ్యప్రదశ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భ, మరాఠావాడ, బిహార్, ఝార్ఖండ్‌లో ఈసారి వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
దిల్లీలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాటికి.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటివరకైతే.. (ఏప్రిల్ 19న) సఫ్దార్‌గంజ్‌లో రికార్డ్ అయిన 39.4 డిగ్రీలే అత్యధికం.
2024 లోక్‌సభ ఎన్నికలు నడుస్తున్న వేళ.. ఐఎండీ ఇస్తున్న వడగాల్పుల హెచ్చరికలు.. సర్వత్రా ప్రధాన్యత సంతరించుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీలో రాగల 6 ఏడు రోజుల వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో నేటి నుంచి రాగల ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు విస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు కురిసే అవకావం ఉందని ఐఎండీ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.