Lok Sabha elections 2024: ఒడిశాలో బీజేడీ తో పొత్తు లేదు; తేల్చేసిన బీజేపీ స్టేట్ చీఫ్-lok sabha elections 2024 bjp calls off alliance with bjd in odisha ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024: ఒడిశాలో బీజేడీ తో పొత్తు లేదు; తేల్చేసిన బీజేపీ స్టేట్ చీఫ్

Lok Sabha elections 2024: ఒడిశాలో బీజేడీ తో పొత్తు లేదు; తేల్చేసిన బీజేపీ స్టేట్ చీఫ్

HT Telugu Desk HT Telugu

Lok Sabha elections 2024: ఈ ఎన్నికల్లో ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ తో పొత్తు పెట్టుకోవడం లేదని బీజేపీ స్పష్టం చేసింది. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 లోక్ సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ శుక్రవారం వెల్లడించారు.

ప్రధాని మోదీ, ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ (HT_PRINT)

Lok Sabha elections 2024: రానున్న ఎన్నికల్లో ఒడిశాలో బిజూ జనతాదళ్ తో పొత్తు పెట్టుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ తెలిపారు. ఒడిశాలోని మొత్తం 21 లోక్ సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలుగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు సమల్ కృతజ్ఞతలు తెలిపారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి

ఒడిశాలో కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని మన్మోహన్ సమల్ ట్విటర్ (గతంలో ఎక్స్) లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న చోట అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని, ఒడిశాలోనూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నామని సమల్ వ్యాఖ్యానించారు.

బీజేపీని గెలిపించాలి..

ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని, అభివృద్ధి చేందిన ఒడిశాను (Odisha elections) తయారు చేయడానికి, లోక్ సభ లోని మొత్తం 21 స్థానాలు, శాసనసభలోని మొత్తం 147 స్థానాలను బీజేపీ గెల్చుకుంటుందని సమల్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఒడిశా ప్రజలకు చేరడం లేదని, దీని వల్ల ఒడిశాలోని పేద సోదరీమణులు, సోదరులకు వారి ప్రయోజనాలు అందడం లేదని ఆరోపించారు.

అభ్యర్థుల ఎంపికలో బీజేడీ

బీజేపీతో పొత్తు చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని బీజేడీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. బీజేపీతో పొత్తుపై చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అభ్యర్థుల జాబితాను బీజేడీ సిద్ధం చేస్తోందన్నారు. బీజేడీతో సీట్ల పంపకాలపై ఒడిశాకు చెందిన బీజేపీ బృందం గత కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి కేంద్ర పెద్దలతో సమావేశాలు నిర్వహించింది. మార్చి 5 న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించినప్పటి నుండి బీజేపీ - బీజేడీ కూటమికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి.