తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heatwaves: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణం అవ్వచ్చు, ఇలా జాగ్రత్తలు తీసుకోండి

Heatwaves: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణం అవ్వచ్చు, ఇలా జాగ్రత్తలు తీసుకోండి

Haritha Chappa HT Telugu

17 April 2024, 8:12 IST

google News
    • Heatwaves: వేసవి ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఈ వేడి వాతావరణం మెదడుకు, గుండెకు తీవ్ర ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్
బ్రెయిన్ స్ట్రోక్ (Pixabay)

బ్రెయిన్ స్ట్రోక్

Heatwaves: అధిక ఉష్ణోగ్రతలు శరీరానికి చాలా చేటు చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది. తీవ్రమైన అలసట, డీ హైడ్రేషన్, మూర్చ వంటివి దీనివల్ల కలగవచ్చు. వైద్యులు చెబుతున్న ప్రకారం శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంటే... వారికి హీట్ స్ట్రోక్ కలిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు మైకం, వికారం, గందరగోళం వంటివి కలగవచ్చు.

బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది?

తీవ్రమైన వేడి గాలుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్టు వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. వేడి కారణంగా గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల మెదడు ఇతర అవయవాలకు రక్తప్రసరణ సరిగా జరగదు. మెదడుకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. అధిక ఉష్ణోగ్రతల వద్ద మెదడులో రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. రక్త నాళాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఉంది, కాబట్టి వడగాడ్పులు బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవ్వచ్చు. చిన్న మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. దీనివల్ల మీరు సాధారణంగా జీవించలేరు.

బ్రెయిన్ స్ట్రోక్ ను బ్రెయిన్ ఎటాక్ అని కూడా పిలుస్తారు. మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా కాకపోవడం వల్ల లేదా మెదడులోని రక్తనాళం పగిలినప్పుడు ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఒక్కొక్కసారి శాశ్వతంగా మెదడు దెబ్బ తినడానికి కారణం అవుతుంది. అలాగే మరణం కూడా సంభవించవచ్చు. వైకల్యం రావచ్చు.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు

మెదడు మన శరీరంలోని అవయవాలను నియంత్రిస్తుంది. స్ట్రోక్ లక్షణాలు మెదడులోని ఏ ప్రాంతంలో కలుగుతాయ ఆ ప్రాంతం నియంత్రించే అవయవాలన్నీ సరిగా పనిచేయవు. ఒకవైపు పక్షవాతం రావచ్చు. మాట్లాడే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అస్పష్టంగా, గజబిజిగా మాట్లాడుతూ ఉంటారు. ముఖానికి ఒక వైపు నియంత్రణ కోల్పోతారు. ఇంద్రియ జ్ఞానం తగ్గుతుంది. చూపు అస్పష్టంగా మారడం లేదా అన్నీ రెండుగా కనిపించడం జరుగుతుంది. అవయవాల మధ్య సమన్వయ లోపం ఉంటుంది. వికారం, వాంతులు కలుగుతూ ఉంటాయి. మెడ దృఢంగా నిలబడదు. గందరగోళంగా, ఆందోళనగా అనిపిస్తుంది. మూర్చ రావచ్చు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. తీవ్రమైన తలనొప్పి రావడం, కోమాలోకి వెళ్లడం జరుగుతుంది.

బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఇలా కాపాడుకోవచ్చు

వేడి వాతావరణంలో బయటకు వెళ్ళకండి. ఉదయం 10 నుండి మధ్యాహ్నం మూడు గంటల మధ్య ఎండలో తిరగకపోవడమే మంచిది. ఆరు బయట ఉన్నప్పుడు కాటన్ దుస్తులను ధరించడం ముఖ్యం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి తగిన మొత్తంలో నీరు తాగండి. టీ, కాఫీలను తాగడం తగ్గించండి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం మానేయడమే ఉత్తమం.

తదుపరి వ్యాసం