తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Variable Dearness Allowance : కార్మికుల కనీస వేతనం పెంపు- కేంద్రం గుడ్​ న్యూస్​!

Variable Dearness Allowance : కార్మికుల కనీస వేతనం పెంపు- కేంద్రం గుడ్​ న్యూస్​!

Sharath Chitturi HT Telugu

27 September 2024, 11:26 IST

google News
    • Variable Dearness Allowance : వీడీఏ (వేరియెబుల్​ డియర్​నెస్​ అలొవెన్స్​)ని పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2024 అక్టోబర్ 1న ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఫలితంగా అసంఘటిత సెక్టార్​లో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు లబ్ధిచేకూరనుంది.
వీడేఏని పెంచిన ప్రభుత్వం..
వీడేఏని పెంచిన ప్రభుత్వం..

వీడేఏని పెంచిన ప్రభుత్వం..

పండగ సీజన్​ నేపథ్యంలో అసంఘటిత సెక్టార్​లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని వీడీఏ (వేరియెబుల్​ డియర్​నెస్​ అలొవెన్స్​)ని పెంచుతున్నట్టు ప్రకటించింది. 2024 అక్టోబర్ 1న ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా చర్యల కారణంగా లక్షలాది మంది కార్మికుల కనీస వేతనం పెరగనుంది.

వీడీఏ పెంపు..

ఈ వీడిఏ పెంపుతో భవన నిర్మాణం, లోడింగ్​-అన్​లోడింగ్​, పారిశుద్ధ్యం, హౌస్​కీపింగ్​, మైనింగ్​, వ్యవసాయ రంగాల్లోని వర్కర్లు లబ్ధిపొందనున్నారు.

ఈ తరహా రంగాల్లో కనీస వేతనం అనేది స్కిల్​ లెవల్స్​పై ఆధారపడి ఉంటుంది. అన్​స్కిల్డ్​, సెమీ స్కిల్డ్​, స్కిల్డ్​, హై-స్కిల్డ్​తో పాటు ఏ,బీ,సీ అంటూ భౌగోళిక ప్రాంతాలకూ కెటగిరీలు ఉంటాయి.

తాజా వీడీఏ పెంపుతో ఏరియా 'ఏ'లోని అన్​స్కిల్డ్​ సెక్టార్​ (నిర్మాణం, క్లీనింగ్​)లో పనిచేసే వారికి రోజుకు కనీస వేతం రూ. 783గా ఉంటుంది. నెలవారీగా ఇది రూ. 20,358. సెమీ-స్కిల్డ్​ వర్కర్లకు రోజుకు రూ. 864, నెలకు రూ. 22,568 లభిస్తుంది. వేరియెబుల్​ డియర్​నెస్​ అలొవెన్స్​ పెంపుతో స్కిల్డ్​ వర్కర్లకు అక్టోబర్​ 1 నుంచి రోజుకు రూ. 954,అంటే నెలకు రూ. 24,804 లభిస్తుంది. హై-స్కీల్డ్​ వర్కర్లకు రోజుకు రూ. 1035, మొత్తం మీద నెలకు రూ. 26,910 జీతం అందుతుంది.

2024లో వర్కర్ల జీతాల సవరణ ఇది రెండోసారి. ఏప్రిల్​లో ఒకసారి అప్డేట్​ అయ్యింది. పరిశ్రమ వర్కరల కోసం సీపీఐని దృష్టిలో పెట్టుకుని ప్రతియేటా రెండుసార్లు వీడీఏని ప్రభుత్వం సవరిస్తుంది.

వేతన పెంపుతో పాటు ఇతర వివరాలను చీఫ్​ లేబర్​ కమిషన్​ వెబ్​సైట్​ clc.gov.in లో చూడవచ్చు.

డీఏ పెంపు పరిస్థితేంటి..?

మరోవైపు డీఏ పెంపు (డియర్​నెస్​ అలొవెన్స్​) వార్త కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఎదురుచూస్తున్నారు. 7వ పే కమిషన్​ ఆధారంగా ఉండే డీఏ, డీఆర్​ (డియర్​నెస్​ రిలీఫ్​) పెంపుపై కేంద్రం త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుందని ఇటీవలే సమాచారం వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగుల డీఏని ప్రతియేటా రెండుసార్లు (జనవరి, జులై) సవరిస్తుంది కేంద్రం. అనంతర నెలల్లో వీటిపై ప్రకటనలు వెలువడతాయి. పండుగ సీజన్​ కూడా సమీపిస్తుండటంతో ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి సెప్టెంబర్​ నెలలోనే ఓ ప్రకటన వస్తుందని అంచనాలు వెలువడ్డాయి. కానీ ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా, దాని అమలు మాత్రం 2024 జులై నుంచే ఉంటుంది. ఫలితంగా 7వ పే కమిషన్​ సిఫార్సుల ఆధారంగా ఉండే డీఏ పెంపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధిచేకూరనుంది.

ఈ ఏడాది ఇప్పటికే ఒకసారి డీఏ పెంపు జరిగింది. ఈ ఏడాది 2024 మార్చ్​లో కేంద్రం డీఏని పెంచింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా నెలలకు ఏరియర్స్​ పడతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం