తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Aspirant: ‘12 అటెంప్ట్స్.. 7 మెయిన్స్, 5 ఇంటర్వ్యూ.. నో సెలక్షన్’-సివిల్స్ అభ్యర్థి ఆవేదన; నెటిజన్ల రియాక్షన్

UPSC aspirant: ‘12 అటెంప్ట్స్.. 7 మెయిన్స్, 5 ఇంటర్వ్యూ.. నో సెలక్షన్’-సివిల్స్ అభ్యర్థి ఆవేదన; నెటిజన్ల రియాక్షన్

HT Telugu Desk HT Telugu

17 April 2024, 15:32 IST

google News
  • గత 12 సంవత్సరాలుగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్నానని, ఐదు సార్లు ఇంటర్య్యూకు హాజరయ్యానని, అయినా, సర్వీస్ రాలేదని ఒక సివిల్స్ అభ్యర్థి ‘ఎక్స్’ లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అతనిని ఓదారుస్తూ నెటిజన్లు పలు కామెంట్స్ చేశారు.

సివిల్స్ అభ్యర్థి కునాల్ ఆర్ విరుల్కర్
సివిల్స్ అభ్యర్థి కునాల్ ఆర్ విరుల్కర్ (X/@kunalrv)

సివిల్స్ అభ్యర్థి కునాల్ ఆర్ విరుల్కర్

UPSC aspirants post viral: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE 2024) తుది ఫలితాలు ఏప్రిల్ 16న విడుదల అయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ర్యాంకు సాధించిన వారి వివరాలు, విజువల్స్ తో సోషల్ మీడియా వేదికలు నిండిపోయాయి. అయితే, వాటి మధ్య యూపీఎస్సీ లో వరుస అటెంప్ట్స్ తరువాత కూడా విజయం సాధించలేకపోయిన ఒక అభ్యర్థి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ సివిల్స్ ఆశావహుడు చేసిన ట్వీట్ నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది.

12 అటెంప్ట్స్.. 7 మెయిన్స్, 5 ఇంటర్వ్యూ.. నో సెలక్షన్

సివిల్స్ పరీక్ష (UPSC CSE 2024) కు సంబంధించి తన వైఫల్యాన్ని ఎక్స్ యూజర్ కునాల్ ఆర్ విరుల్కర్ ఇలా వ్యక్తం చేశారు. ‘‘12 ప్రయత్నాలు.. అందులో 7 మెయిన్. 5 ఇంటర్వ్యూలు.. నో సెలక్షన్’’ అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కామెంట్ తో పాటు ‘‘బహుశా జీవితానికి మరో పేరు పోరాటం’’ అని ఓ వ్యాఖ్యను కూడా జోడించాడు. ఆ పోస్ట్ కు యూపీఎస్సీ (UPSC) ఇంటర్వ్యూకి హాజరైన నాటి తన పాత ఫొటోను జత చేశారు.

2.2 మిలియన్ల వ్యూస్

ఈ పోస్ట్ ను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఫైనల్ ఫలితాలు వెల్లడైన రోజు కునాల్ ఆర్ విరుల్కర్ షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు 2.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ షేర్ పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.

ఈ పోస్ట్ గురించి ఎక్స్ యూజర్లు ఏమన్నారంటే?

‘‘బహుశా జీవితం మరింత పెద్ద విజయాలను మీ కోసం అట్టిపెట్టి ఉండవచ్చు. మీలో ఉన్న పోరాటాన్ని, పట్టుదలను వర్ణించడానికి మాటలు సరిపోవు. మేమందరం మిమ్మల్ని చూసి గర్విస్తున్నాము. ప్రతిసారీ నువ్వే గెలిచావు' అని ఓ ఎక్స్ యూజర్ స్పందించారు. ‘‘ఇది చాలా బాధాకరంగా ఉంది. మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మీకు మరింత శక్తి. చాలా ప్రేమ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘‘భాయ్, మీ విషయంలో నేను ఒకటి చెప్పగలను. మీ లక్ష్యాలను సాధించకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు! బెస్ట్ ఆఫ్ లక్. నేను మీకు ఏ విధంగానైనా సహాయం చేయగలనా? దయచేసి నాకు తెలియజేయండి" అని మరో యూజర్ స్నేహహస్తం అందించారు.

తదుపరి వ్యాసం