Civils Ranker Uday Krishna Reddy : సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా - ఏకంగా 'సివిల్స్' సాధించేశాడు-prakasam district police constable resigns police job after humiliation cracks upsc civils results 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Civils Ranker Uday Krishna Reddy : సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా - ఏకంగా 'సివిల్స్' సాధించేశాడు

Civils Ranker Uday Krishna Reddy : సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా - ఏకంగా 'సివిల్స్' సాధించేశాడు

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 17, 2024 10:40 AM IST

UPSC Civils Results 2023 : సివిల్స్ 2023 ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి మెరిశాడు. కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకొని సివిల్స్ సాధించాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 780వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.

ఉదయ్ కృష్ణారెడ్డి
ఉదయ్ కృష్ణారెడ్డి

Civils Ranker Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డి(Uday Krishna Reddy)… 2012లోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2019 వరకు జాబ్ చేశాడు. కానీ తోటి ఉద్యోగుల ముందు ఓ సీఐ తీవ్రంగా అవమానించటాన్ని తట్టుకోలేకపోయాడు. దీన్ని చాలెంజ్ గా తీసుకున్న కృష్ణారెడ్డి….కీలక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సివిల్స్ కు సన్నద్ధమయ్యాడు. మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలం అయినా…. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్(UPSC Civils Results) సాధించాడు. 2023 ఫలితాల్లో(UPSC Civils Results 2023) 780వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.

ఉదయ్ కృష్ణారెడ్డి నేపథ్యం….

ఉదయ్ కృష్ణారెడ్డిది(Civils Ranker Uday Krishna Reddy) ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. నాయనమ్మ దగ్గరే పెరిగాడు. ఈ క్రమంలోనే 2012లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ఏడేళ్ల సర్వీస్ తర్వాత… రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు కృష్ణారెడ్డి. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ సాధించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు.

"60 మంది పోలీసుల ముందు ఓ సీఐ తీవ్రంగా అవమానించాడు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ వెంటనే సివిల్స్ కు ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మూడుసార్లు రాశాను. నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను" అని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పాడు.

సివిల్స్ ఫలితాల్లో(UPSC Civils Results 2023) 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి(Uday Krishna Reddy)కి ఐఎఎస్ కేడర్ కాకుండా… ఐఆర్ఎస్(Indian Revenue Service) వచ్చే అవకాశం ఉంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం… తన ప్రిపరేషన్ ఆపే ప్రసక్తే లేదని… ఐఎఎస్(Indian Administrative Service) కు కేడర్ కు ఎంపిక కావటమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

UPSC Civils 2023 Results : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాలు(UPSC Civils 2023 Results) మంగళవారం విడుదల అయ్యాయి. సివిల్స్ ఫైనల్ రిజల్ట్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్-2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్య తన ఫస్ట్ అటెంప్ట్ లోనే మూడో ర్యాంకు(UPSC AIR 3rd Rank) సాధించారు. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు రావడంపై అనన్య రెడ్డి (Donuru Ananya Reddy)సంతోషం వ్యక్తం చేశారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నానన్నారు. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజులు 12-14 గంటలు చదివేదానినని ఆమె తెలిపారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాల్లో(UPSC Civils Results) 1,016 మందిని ఎంపిక చేశారు. 180 మంది ఐఏఎస్ (IAS)కు, 37 మంది ఐఎఫ్ఎస్(IFS) కు, 200 మంది ఐపీఎస్ (IPS)కు ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కేటగిరిలో 613 మంది, గ్రూప్-బి సర్వీసెస్ లో 113 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ సర్వీసెస్-2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 50 అభ్యర్థులు ర్యాంకులు సాధించారు.

IPL_Entry_Point