Crime news : 2014లో మహిళపై రేప్, హత్య- 2024లో దొరికిన నిందితుడు..!
08 October 2024, 11:32 IST
Crime news : 2014లో ఓ మహిళను రేప్ చేసిన హత్య చేసిన నిందితుడు 2014లో పోలీసులకు దొరికాడు. అతనిపై అప్పటికే 5 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.
పదేళ్ల క్రితం మహిళ దారుణ హత్య.. తాజాగా నిందితుడి అరెస్ట్
పదేళ్ల క్రితం నైరుతి దిల్లీలో ఓ మహిళపై అత్యాచారం, ఆ తర్వాత హత్య చేసిన 48 ఏళ్ల వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడిని రాంపాల్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది..
2014 ఆగస్ట్‌లో జరిగింది ఈ ఘటన. రాంపాల్, అతని అనుచరులు ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె నగ్న మృతదేహాన్ని వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ పరిధిలోని సంజయ్ వాన్ ప్రాంతంలో పడేశారు.
2014 ఆగస్టు 8న రాంపాల్ స్నేహితులు మనోజ్, రాకేష్‌లు సంజయ్ వాన్ ప్రాంతంలో పార్టీకి చేసుకున్నారు.
అదే సమయంలో ఆ ప్రాంతంలోని ఓ పార్కులో బాధితురాలు కనిపించింది. తన తండ్రిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించడంతో ఓ మహిళ తరచూ ఆ పార్కుకు వేళ్లేది. ఆ రోజు, ఆమె పార్కులో ఉన్న సమయంలో వారంతా ఆ మహిళపై అత్యాచారం చేశారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఈ విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.
కాగా పదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో ఇతర నిందితులను పోలీసులు పట్టుకోగలిగారు. కానీ ప్రధాన నిందితుడు రాంపాల్‌ని మాత్రం పట్టుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారు. కానీ ఎప్ఐఆర్ నమోదు చేసుకుని, పరారీలో ఉన్న రాంపాల్‌ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అతడిని పరారీలో ఉన్న నేరస్తుడిగానూ గుర్తించారు.
రాంపాల్‌కి గతంలో దిల్లీ, యూపీల్లో హత్య, అపహరణ, అత్యాచారం, హత్యాయత్నం సహా ఐదు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.
“మా బృందం అక్టోబర్ 1న యూపీలోని బాగ్‌పట్‌లోని లుహారీ గ్రామంలో నిందితుడిని అరెస్టు చేసింది. అతను గత పదేళ్లుగా పరారీలో ఉన్నాడు. అతను తన సహచరులతో కలిసి ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశాడు. అనంతరం నగ్నంగా మృతదేహాన్ని పడేశాడు,” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్) అమిత్ కౌశిక్ తెలిపారు.
సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నిందితుడు లుహారీ గ్రామంలోని తన ఇంటికి వస్తాడని తమ బృందానికి పక్కా టిప్ రావడంతో వెంటనే స్పందించినట్టు పోలీసు అధికారి వివరించారు. ట్రాప్ వేసి అతడిని పట్టుకున్నట్టు స్పష్టం చేశారు.
రాంపాల్ 1993లో హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లాడని, అక్కడ అతను, అతని తండ్రి పక్క సెల్లో ఉన్న వారిని కొట్టారని పోలీసులు తెలిపారు.
జైలు నుంచి బయటకు వచ్చాక రాంపాల్ తన గ్రామంలో గ్యాంగ్‌స్టర్‌లా ప్రవర్తించడం ప్రారంభించాడని డీసీపీ తెలిపారు.
1994లో రాంపాల్ తండ్రిని అదే గ్రామానికి చెందిన సుభాష్, రాజేందర్ హత్య చేశారు. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్లోని కొన్ని భాగాలను సుభాష్, రాజేందర్ దొంగిలించగా అది రాంపాల్ తండ్రి చూసి వారిని పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురయ్యాడు!
తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రాంపాల్ తన బావమరిది, తల్లితో కలిసి సుభాష్‌ని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
2002లో రాంపాల్, అతని అనుచరులు పప్పు, జశ్వంత్ తమ గ్రామంలోని వైన్ షాప్ సమీపంలో ఓ వ్యక్తిని హత్య చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు అని పోలీసలు వివరించారు.