తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. ఈ వారమే స్ట్రీమింగ్

OTT Crime Thriller: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. ఈ వారమే స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu

07 October 2024, 8:22 IST

google News
    • OTT Crime Thriller: ఓటీటీలో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా రాబోతోంది. ఈ వారమే స్ట్రీమింగ్ కు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈటీవీ విన్ ఓటీటీ ఆదివారం (అక్టోబర్ 6) రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా సాగింది.
ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. ఈ వారమే స్ట్రీమింగ్
ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. ఈ వారమే స్ట్రీమింగ్

ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. ఈ వారమే స్ట్రీమింగ్

OTT Crime Thriller: ప్రముఖ తెలుగు ఓటీటీల్లో ఒకటైన ఈటీవీ విన్ మరో ఒరిజినల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పేరు తత్వ. ఇదొక లో బడ్జెట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్య ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ బడ్జెట్ ను కాకుండా కథనే నమ్ముకుంటున్నట్లుగా ఈ తత్వ కూడా ట్విస్టులతో కూడిన కథనే నమ్ముకొని వస్తోంది. తాజాగా ఆదివారం (అక్టోబర్ 6) రిలీజైన ట్రైలర్ ఈ మూవీ అందించబోయే థ్రిల్ ఎలాంటిదో చెప్పకనే చెప్పింది.

తత్వ ఓటీటీ రిలీజ్ డేట్

ఈటీవీ విన్ ఓటీటీ అక్టోబర్ రిలీజెస్ గురించి ఒకటో తేదీనే వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో ఈ తత్వ మూవీ కూడా ఒకటి. వచ్చే గురువారం (అక్టోబర్ 10) నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హిమ దాసరి, ఉస్మాన్ గని, పూజా రెడ్డి ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఓ లోబడ్జెట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తత్వ. ఈ ట్రైలర్ ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మూవీపై అంచనాలను పెంచేసింది.

"తత్వ మూవీ మాసివ్ యాక్షన్ ట్రైలర్ ఇప్పుడు వచ్చేసింది" అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఓటీటీ ఈ ట్రైలర్ రిలీజ్ చేసింది. రుత్విక్ ఎలగారి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మొత్తం ఆరిఫ్ అనే ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. దొంగతనం చేయడానికి ప్రయత్నించి అంతకంటే దారుణమైన క్రైమ్ లో చిక్కుకునే ఆ వ్యక్తి.. తర్వాత ఎలా తప్పించుకుంటాడన్నదే ఈ మూవీ స్టోరీ.

ట్రైలర్ మొత్తం చాలా ఇంట్రెస్టింగా సాగింది. ఇందులోని ట్విస్టులు సినిమాపై ఆసక్తి పెంచాయి. అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ తత్వ మూవీ ఎలాంటి థ్రిల్ పంచుతుందో చూడాలి.

ఈటీవీ విన్ అక్టోబర్ రిలీజెస్

ఈటీవీ విన్ ఓటీటీలోకి అక్టోబర్ నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఇప్పటికే రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ అక్టోబర్ 3 నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ఇప్పుడు అక్టోబర్ 10న ఈ తత్వతోపాటు పైలం పిలగా అనే మరో మూవీ కూడా రాబోతోంది. తెలంగాణ నేటివిటీతో సాగే సినిమా ఇది. ఇక అక్టోబర్ 31న కొరియన్ వెబ్ సిరీస్ హిడెన్ ఐడెంటిటీ తెలుగులో వస్తోంది. ఇక మరో మూవీ కలి కూడా త్వరలోనే ఇదే ఓటీటీలోకి రానుంది.

తదుపరి వ్యాసం