ETV Win OTT October Releases: ఈటీవీ విన్ ఓటీటీలోకి అక్టోబర్‌లో రానున్న సినిమాలు ఇవే.. మూడు తెలుగు, ఓ కొరియన్ వెబ్ సిరీస్-etv win ott october releases telugu movies tatva kali korean drama web series hidden identity ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Etv Win Ott October Releases: ఈటీవీ విన్ ఓటీటీలోకి అక్టోబర్‌లో రానున్న సినిమాలు ఇవే.. మూడు తెలుగు, ఓ కొరియన్ వెబ్ సిరీస్

ETV Win OTT October Releases: ఈటీవీ విన్ ఓటీటీలోకి అక్టోబర్‌లో రానున్న సినిమాలు ఇవే.. మూడు తెలుగు, ఓ కొరియన్ వెబ్ సిరీస్

Hari Prasad S HT Telugu
Oct 01, 2024 05:24 PM IST

ETV Win OTT October Releases: ఈటీవీ విన్ ఓటీటీలోకి ప్రతి నెలలాగే అక్టోబర్ లోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా.. మరొకటి కొరియన్ డబ్బింగ్ వెబ్ సిరీస్ కావడం విశేషం.

ఈటీవీ విన్ ఓటీటీలోకి అక్టోబర్‌లో రానున్న సినిమాలు ఇవే.. మూడు తెలుగు, ఓ కొరియన్ వెబ్ సిరీస్
ఈటీవీ విన్ ఓటీటీలోకి అక్టోబర్‌లో రానున్న సినిమాలు ఇవే.. మూడు తెలుగు, ఓ కొరియన్ వెబ్ సిరీస్

ETV Win OTT October Releases: ఈటీవీ విన్ ఓటీటీ ముఖ్యమైన పండగలు, హాలీడేస్ ఉన్న అక్టోబర్ నెల కోసం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని నెల తొలి రోజు అయిన మంగళవారం (అక్టోబర్ 1) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలతోపాటు ఒక కొరియన్ డబ్బింగ్ వెబ్ సిరీస్ రాబోతోంది.

ఈటీవీ విన్ ఓటీటీ అక్టోబర్ రిలీజెస్

ఈటీవీ విన్ ఓటీటీ ప్రతి నెలా మొదటి రోజు ఆ నెలలో తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలను వెల్లడిస్తుంది. అక్టోబర్ నెలకు సంబంధించి కూడా తొలి రోజే రాబోతున్న ఆ కొత్త మూవీస్, సిరీస్ ఏవో చెప్పింది. "అక్టోబర్ లో సినిమా పండుగ మొదలు.. కొత్త కథలు, భారీ బ్లాక్‌బస్టర్స్, మాస్ ఎంటర్టైన్మెంట్ మీకోసం.. ఈటీవీ విన్ లో ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి" అనే క్యాప్షన్ తో ఓ ట్వీట్ చేసింది.

ఆ తర్వాత ఈ నెలలో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్.. వాటి తేదీలను వెల్లడించింది. ముందుగా అక్టోబర్ 10వ తేదీన తత్వ అనే తెలుగు మూవీ ఈ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇక అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న కలి అనే మూవీ డిజిటల్ హక్కులను కూడా ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.

ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా అక్టోబర్ లోనే తమ ఓటీటీలోకి రానున్నట్లు ఈటీవీ విన్ తెలిపింది. ఈ రెండు మూవీస్ కాకుండా 2015లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ హిడెన్ ఐడెంటిటీ కూడా ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్ లో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ తెలిపింది.

ఇక అక్టోబర్ 3 నుంచి రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‌ఫామ్ గతంలోనే వెల్లడించింది. గురువారం నుంచి ఈ సినిమాను చూడటానికి సిద్ధమైపోండి. ఇప్పటికే రాజ్ తరుణ్ కు చెందిన పురుషోత్తముడు, తిరగబడరా సామీ మూవీస్ ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఈటీవీ విన్ ఓటీటీ సెప్టెంబర్ రిలీజెస్

ఇక ఈటీవీ విన్ ఓటీటీలోకి సెప్టెంబర్ లోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. థియేటర్లలో సంచలన విజయం సాధించిన కమిటీ కుర్రోళ్లు, ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ సోపతులు, ఆర్టీఐ, సురాపానం, వరుణ్ సందేశ్ నటించిన నిందలాంటి తెలుగు మూవీస్ గత నెలలో ఈ ఓటీటీలోకి అడుగు పెట్టాయి. ఇక కొరియన్ వెబ్ సిరీస్ వెల్‌కమ్ 2 లైఫ్ కూడా తెలుగులో ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.