MP rape case : 200 మంది పోలీసులు, డ్రోన్​తో 5 రోజుల వేట- చివరికి దొరికిన అత్యాచార నిందితుడు!-madhya pradesh cops nab rape accused after massive 5 day manhunt ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mp Rape Case : 200 మంది పోలీసులు, డ్రోన్​తో 5 రోజుల వేట- చివరికి దొరికిన అత్యాచార నిందితుడు!

MP rape case : 200 మంది పోలీసులు, డ్రోన్​తో 5 రోజుల వేట- చివరికి దొరికిన అత్యాచార నిందితుడు!

Sharath Chitturi HT Telugu
Sep 30, 2024 09:48 AM IST

MP rape case : ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మధ్యప్రదేశ్​కు చెందిన 22 ఏళ్ల యువకుడని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేష్​లో 200మంది పోలీసులు, 500 మంది స్థానికులు పాల్గొన్నారు. నైట్ విజన్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ సాయం కూడా తీసుకున్నారు.

మధ్యప్రదేశ్​ రేప్​ కేసు నిందితుడి అరెస్ట్​..
మధ్యప్రదేశ్​ రేప్​ కేసు నిందితుడి అరెస్ట్​..

మధ్యప్రదేశ్​లో కలకలం సృష్టించిన 5ఏళ్ల చిన్నారి రేప్​ కేసు నిందితుడు ఎట్టకేలకు దొరికాడు! 200మంది పోలీసులు, 500 మంది స్థానికులు, డ్రోన్​లతో 5 రోజుల గాలింపు చర్యలు అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. పోలీసులకు దొరికే ముందు నిందితుడు అత్మహత్యకు విఫలయత్నం చేశాడు.

ఇదీ జరిగింది..

మధ్యప్రదేశ్​లోని హర్డాలో ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 22 ఏళ్ల యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు ఈ నెల 23 నుంచి ఐదు రోజుల పాటు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. 

గాలింపు చర్యల్లో సుమారు 200 మంది పోలీసులు, 500 మందికి పైగా స్థానికులు పాల్గొన్నారు. నైట్ విజన్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ సైతం వారికి సాయం అందించింది. దుండగుడిని పట్టుకునేందుకు ఐదు రోజుల పాటు హర్దా, ఖాండ్వా, బేతుల్ సహా మూడు జిల్లాల్లో దాదాపు 250 చదరపు కిలోమీటర్ల మేర గాలింపు చేపట్టారు.

నిందితుడిని బేతుల్​లోని మోహన్ పురా ప్రాంతాంలో ఆదివారం ఉదయం పట్టుకున్నట్టు తెలిపారు.

సెప్టెంబర్ 23న సిరాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నది సమీపంలో ఐదేళ్ల బాధితురాలు కనిపించింది. వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సునీల్ కోర్కు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల రివార్డు సైతం ప్రకటించారు. మధ్యప్రదేశ్​లోని ఖల్వా ప్రాంతానికి చెందిన నిందితుడు మొక్కజొన్న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చేరాడు.

అత్యాచార ఘటన కలకలం సృష్టించడంతో నిందితుడు తన ఫోన్​ను విసిరేశాడు. నిరంతరం సంచరిస్తూ ఉండేవాడని ది హిందూ రిపోర్టు తెలిపింది. అతను మొదట ఖాండ్వాకు వెళ్లాడని, ఆ తర్వాత హర్దాకు తిరిగి వచ్చి బేతుల్​కి పారిపోయాడని, అయితే జిల్లా సరిహద్దు సమీపంలో పట్టుబడ్డాడని పోలీసు అధికారి తెలిపారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పొలాలు, అడవుల్లో మూడు రోజుల పాటు నడిచాడు. అడవిలోని 33 గ్రామాల్లో ముగ్గురు పోలీసు అధికారులను మోహరించినట్టు తెలుస్తోంది.

అతడిని పట్టుకున్నప్పుడు అరెస్టు చేస్తారనే భయంతో పొలంలో దొరికిన బాటిల్ నుంచి పురుగుల మందు తాగినట్లు చెప్పాడని పోలీసు అధికారి తెలిపారు.

యూట్యూబ్ ఫేమ్​పై రేప్​ కేసు..

జగిత్యాలలో ‍సోషల్‌ మీడియాలో ఫేమ్‌ అయిన యూట్యూబర్‌పై రేప్‌ కేసు నమోదైంది. జిల్లాలోని బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన మల్లిక్ తేజ రైటర్ సాంస్కృతిక సారధి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. యూట్యూబ్ ఫేమ్​గా సుపరిచితుడు. అదే గ్రామానికి చెందిన యువతి ఫోక్ సాంగ్ సింగర్​తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోక్ సాంగ్ సింగర్ లు కావడంతో పలు అల్బమ్ లు తీశారు. ఏమైందో ఏమో కానీ ఆ యువతి మల్లిక్ తేజ పై పోలీసులకు పిర్యాదు చేసింది. మాటలు చెప్పి లొంగ తీసుకొని అత్యాచారం చేశాడని పిర్యాదు లో పేర్కొంది. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం