Crime Thriller Movie OTT: ఓటీటీలోకి డైరెక్ట్‌గా రానున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
06 October 2024, 17:38 IST
- Tatva OTT Release Date: తత్వ చిత్రం నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఇప్పటికే రివీల్ అయింది. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గానే సాగింది.
OTT Telugu Crime Thriller: ఓటీటీలోకి డైరెక్ట్‌గా రానున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈటీవీ విన్ కొంతకాలంగా జోరు పెంచింది. నేరుగా స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చే సినిమాలను పెంచుతోంది. ఇప్పుడు మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తత్వ పేరుతో ఈ మూవీ వస్తోంది. ఈ చిత్రంలో హిమ దాసరి ప్రధాన పాత్ర పోషించారు. తత్వ సినిమా ట్రైలర్‌ను నేడు (అక్టోబర్ 6) ఈటీవీ విన్ తీసుకొచ్చింది.
ట్రైలర్ ఇలా..
ఓ మర్డర్ కేసులో క్యాబ్ డ్రైవర్ ఆరిఫ్ (హిమ దాసరి) చిక్కుకోవడం చుట్టూ తత్వ మూవీ సాగనుంది. ఆరిఫ్‍కు గన్‍ను ఓ వ్యక్తి గురి పెట్టడంతో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత ఓ పోలీస్ ఆఫీసర్ ప్రశ్నించే ఆరిఫ్‍ను ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పటికే చేతికి సంకెళ్లు, ముఖంపై గాయంతో ఆరిఫ్ ఉంటారు. నిజం చెబితే ఈ పరిస్థితి నుంచి బయటపడతావని అతడితో పోలీస్ చెబుతారు. "ఇప్పుడు నా దగ్గర ఉన్నవి రెండే ఆప్షన్లు.. ఒకటి అబద్ధం చెప్పి తప్పించుకోవడం.. రెండు నిజం చెప్పి దొరికిపోవడం.. కానీ నాకే తెలియని మూడో ఆప్షన్ కూడా” ఉందని ఆరిఫ్ అనుకుంటాడు.
ఆ తర్వాత ఆరిఫ్ కారులో ఎక్కిన వ్యక్తి గన్‍తో అతడిని బెదిరించడం ఉంది. ఆ వ్యక్తిని బయటి లాగడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయిందని ఆరిఫ్‍తో పోలీస్ చెబుతారు. క్యాబ్ దగ్గర ఆరిఫ్, మరో వ్యక్తి పరస్పరం గన్ గురి పెట్టుకునే షాట్ ఉంది. ఇంకేమైనా ఉందా చెప్పాల్సిందని అని పోలీస్ అడుగుతారు. హుషారుగా విజిల్ వేస్తూ ఆరిఫ్ కారు ఎక్కే షాట్‍తో ఈ ట్రైలర్ ముగిసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ వ్యక్తిని ఆరిఫ్ చంపాడా లేకపోతే ఇంకెవరైనా హత్య చేశారా? మిస్టరీ వీడిందా అనే అంశాల చుట్టూ తత్వ సినిమా తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా సుమారు గంట రన్‍టైమ్‍తోనే ఉండనుంది.
తత్వ చిత్రంలో రుత్విక్ యలగరి దర్శకత్వం వహించారు. ట్విస్టులతో ఈ మూవీని రూపొందించారని ట్రైలర్‌తో తెలుస్తోంది. కథను పెద్దగా రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ ఉంది. ఈ చిత్రంలో హిమ దాసరి, ఉస్మాన్ ఘని, పూజా రెడ్డి లీడ్ రోల్స్ చేశారు. మానసా దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
స్ట్రీమింగ్ వివరాలు ఇవే
తత్వ సినిమా అక్టోబర్ 10వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా రివీల్ చేసింది.
రీసెంట్‍గా భలే ఉన్నాడే
రాజ్ తరుణ్ హీరోగా నటించిన భలే ఉన్నాడే సినిమా ఇటీవలే ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అక్టోబర్ 3న ఈ చిత్రం అడుగుపెట్టింది. థియేటర్లలో సెప్టెంబర్ 13న రిలీజైన ఈ కామెడీ డ్రామా మూవీ 20 రోజుల్లోనే ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, మనీశా కందుకూర్ ప్రధాన పాత్రలు చేశారు. అభిరామి గోపికుమార్, సింగీతం శ్రీనివాసరావు, వీటీవీ గణేశ్, హైపర్ ఆది కీరోల్స్ చేశారు. ఈ భలే ఉన్నాడే చిత్రానికి శివసాయి వర్దన్ దర్శకత్వం వహించారు.