తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: హైవే సమీపంలో మహిళ మృతదేహం కుక్కిన సూట్ కేస్ లభ్యం; బాడీపై తీవ్రమైన గాయాలు

Crime news: హైవే సమీపంలో మహిళ మృతదేహం కుక్కిన సూట్ కేస్ లభ్యం; బాడీపై తీవ్రమైన గాయాలు

Sudarshan V HT Telugu

16 November 2024, 16:48 IST

google News
  • Crime news: ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ మృతదేహం కుక్కి ఉన్న ఒక సూట్ కేసును హైవే సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కన స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినీత్ భట్నాగర్ తెలిపారు.

హైవే సమీపంలో మహిళ మృతదేహం కుక్కిన సూట్ కేస్ లభ్యం
హైవే సమీపంలో మహిళ మృతదేహం కుక్కిన సూట్ కేస్ లభ్యం ((Representational image))

హైవే సమీపంలో మహిళ మృతదేహం కుక్కిన సూట్ కేస్ లభ్యం

UP Crime news: ఉత్తర ప్రదేశ్ లోని హపూర్ జిల్లాలోని ఢిల్లీ-లక్నో హైవే సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కన ఒక ఎర్రటి సూట్ కేసును స్థానికులు గుర్తించారు. అందులో ఒక మహిళ మృతదేహం కుక్కి ఉండడం గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూట్ కేస్ ను తెరిచి చూడగా శరీరమంతా గాయాలున్న ఒక మహిళ మృతదేహం వారికి కనిపించింది.

పోలీసు కేసు నమోదు

బాధితురాలి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినీత్ భట్నాగర్ తెలిపారు. ‘‘సర్వీస్ రోడ్డు సమీపంలో మృతదేహం లభ్యమైంది. పోలీసు సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి పంపించాము’’ అని భట్నాగర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆ యువతి ఎవరనే తెలియజేసే వివరాలేవీ ఘటనా స్థలం వద్ద తమకు లభించలేదన్నారు. ఆ మహిళ గాయాలను పరిశీలిస్తే, ఆమె ఒక రోజు ముందే మరణించి ఉండవచ్చని తెలుస్తోంది. ఆమె ఐడెంటిటీని సూచించే ఆనవాళ్లేవీ లభించలేదు’’ అని తెలిపారు.

గత నెలలో కాన్పూర్ లో..

గత నెలలో కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ బంగ్లా సమీపంలో కూడా ఒక యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె హత్యకు గురైన నాలుగు నెలల తర్వాత ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మొదట ఆ మహిళ కనిపించకుండా పోయిందని తమకు ఫిర్యాదు అందిందని, ఆ తర్వాత జరిపిన విచారణలో ఆమె చనిపోయినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జిమ్ ట్రైనర్ విమల్ సోనీని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో గ్రీన్ పార్క్ ప్రాంతంలో పనిచేసే జిమ్ ట్రైనర్ ప్రభుత్వ అధికారులకు కేటాయించిన బంగ్లాలు ఉన్న ప్రాంతంలో ఆ యువతి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించాడు.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్