Weight Loss: జిమ్ మానేసి సింపుల్ వర్కౌట్స్, ఇంటి ఫుడ్‍తో 20 కేజీల బరువు తగ్గాలన్న మహిళ.. ఏం చెప్పారంటే..-woman lost 20 kgs weight with dumbbells and home food she reveals ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: జిమ్ మానేసి సింపుల్ వర్కౌట్స్, ఇంటి ఫుడ్‍తో 20 కేజీల బరువు తగ్గాలన్న మహిళ.. ఏం చెప్పారంటే..

Weight Loss: జిమ్ మానేసి సింపుల్ వర్కౌట్స్, ఇంటి ఫుడ్‍తో 20 కేజీల బరువు తగ్గాలన్న మహిళ.. ఏం చెప్పారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 12, 2024 10:30 AM IST

Weight Loss: తాను 20 కేజీల బరువు తగ్గానంటూ ఓ మహిళ సోషల మీడియాలో షేర్ చేశారు. జిమ్ మానేసి ఇంట్లోనే సింపుల్ ఎక్సర్‌సైజ్, ఇంటి ఫుడ్‍తోనే వెయిల్ లాస్ అయ్యానంటూ వెల్లడించారు. తాను పాటించిన విధానాన్ని షేర్ చేసుకున్నారు.

Weight Loss: జిమ్ మానేసి సింపుల్ వర్కౌట్‍, ఇంటి ఫుడ్‍తో 20 కేజీల బరువు తగ్గాలన్న మహిళ.. ఏం చెప్పారంటే..
Weight Loss: జిమ్ మానేసి సింపుల్ వర్కౌట్‍, ఇంటి ఫుడ్‍తో 20 కేజీల బరువు తగ్గాలన్న మహిళ.. ఏం చెప్పారంటే..

బరువు తగ్గేందుకు తీసుకునే ఆహారం, రెగ్యులర్‌గా చేసే వ్యాయామాలు కీలకపాత్ర పోషిస్తాయి. క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ.. సరైన వర్కౌట్స్ చేస్తే వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. కొందరు వారికి తగ్గట్టుగా వీటిని ప్లాన్ చేసుకుంటూ బరువు తగ్గుతుంటారు. నవీనా ముహిలాన్ అనే మహిళ తాను 20 కేజీల బరువు తగ్గానంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో తాజాగా వెల్లడించారు. ఫిట్‍నెస్ కోచ్‍గా చెప్పుకున్న ఆమె తన వెయిట్ లాస్ జర్నీని, తాను పాటించిన విధానాలను చెప్పారు.

డంబెల్స్‌తో ఎక్సర్‌సైజ్, ఇంటి ఫుడ్

తాను ప్రతీ రోజు 5 కేజీలు, 10 కేజీల డంబెల్స్‌తో ఇంట్లో సింపుల్ వర్కౌట్స్ చేశానని నవీనా చెప్పారు. బరువు తగ్గడంలో ఈ వ్యాయామాలు చాలా ఉపయోగపడ్డాయని తెలిపారు. “రెండు డంబెల్స్ సాయంతోనే నేను ఇంట్లోనే 20 కేజీల బరువు తగ్గా. కొవిడ్-19 సమయంలో బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో నేను ఇది మొదలుపెట్టా. నాకు స్విగ్వీ, జొమాటో లాంటివి వాడే అలవాటు లేకపోవడం మంచిదైంది. ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తిన్నా. 5 కేజీలు, 10 కేజీల డంబెల్స్‌తో ఇంట్లో ప్రతీ రోజు వర్కౌట్స్ చేశా. నడిచా, డ్యాన్స్ చేశా. బరువు తగ్గేందుకు ఎలాటి మ్యాజిక్ ఫుడ్స్, గంటల పాటు కార్డియోలు చేయాల్సిన అవసరం లేదని తెలుసుకున్నా. సరైన ఫుడ్ తిని.. రోజులో 45 నిమిషాల నుంచి 60 నిమిషాలు వర్కౌట్స్ చేస్తే చాలు” అని నవీనా ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

జిమ్ మానేసి ఇంట్లోనే వర్కౌట్స్

కొన్ని సంవత్సరాల పాటు తాను జిమ్‍ వెళ్లానని, అయితే అది తనకు సూటవదని ఇంట్లోనే వర్కౌట్స్ మొదలుపెట్టానని చెప్పారు. “నేను కాన్ఫిడెంట్‍గా లేననే కారణంతో ఆరేళ్ల క్రితం జిమ్‍కు వెళ్లడం ప్రారంభించా. నేను దుస్తుల ఫిట్‍తో నేను బాధపడేదాన్ని. ఒకటి, రెండు నెలల్లో మోడల్‍గా బాడీ కావాలనే ఉద్దేశంతో జిమ్‍కు చేరా. అయితే కాలం గడుస్తున్న కొద్దీ నా ఆలోచన మారింది. ఏళ్ల పాటు జిమ్ మెంబర్‌షిప్‍లకు డబ్బు వేస్ట్ చేశాక.. నేను ఇంట్లోనే వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టా. ఇప్పుడు పరిస్థితులు మారాయి.

ఫిట్‍నెస్ అంటే తనకు ఏం అర్థమైందో కూడా ఆమె వివరించారు. “ఫిట్‍నెస్ ఎలా పని చేస్తుందో నాకు అర్థమైంది. ఇది త్వరగా ఫిక్స్ అయ్యేది కాదు, ఇదో జీవనశైలి. చీట్ మీల్స్, డిటాక్స్ డ్రింక్స్ గురించి కాదు. ఫిట్‍నెస్ అనేది శరీరంపై శ్రద్ధ చూపడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం” అని నవీనా చెప్పారు.

బరువు తగ్గడం అనేది ఆహారం, వ్యాయామాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, వెయిట్ లాస్ వారు వారి శరీర పరిస్థితి, ఆరోగ్యం, గోల్‍ను బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.

Whats_app_banner