తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Asian Games : క్రీడల్లోనూ రాజకీయాలు.. అరుణాచల్​ ప్రదేశ్​ అథ్లెట్స్​కు వీసా ఇవ్వని చైనా!

Asian Games : క్రీడల్లోనూ రాజకీయాలు.. అరుణాచల్​ ప్రదేశ్​ అథ్లెట్స్​కు వీసా ఇవ్వని చైనా!

Sharath Chitturi HT Telugu

22 September 2023, 16:18 IST

google News
  • Asian Games : ఏషియన్​ గేమ్స్​లో పాల్గొనాల్సి ఉన్న ముగ్గురు అరుణాచల్​ ప్రదేశ్​ ప్లేయర్స్​కు వీసా ఇవ్వలేదు చైనా. ఈ వ్యవహారంపై భారత్​ తీవ్రస్థాయిలో మండిపడింది.

క్రీడల్లోనూ చైనా రాజకీయాలు..
క్రీడల్లోనూ చైనా రాజకీయాలు.. (AFP)

క్రీడల్లోనూ చైనా రాజకీయాలు..

Asian Games 2023 : క్రీడల్లోనూ చైనా రాజకీయాలు చేస్తోంది! తాజాగా.. ఏషియన్​ గేమ్స్​లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న అరుణాచల్​ప్రదేశ్​కు చెందిన ముగ్గురు అథ్లెట్స్​కు ఆ దేశం వీసాలు మంజూరు చేయలేదు. ఈ వ్యవహారంపై భారత్​ తీవ్రస్థాయిలో మండిపడింది. చైనా చర్యలపై నిరసనగా.. భారత దేశ క్రీడాశాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​.. చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఇదీ జరిగింది..

భారత్​- చైనాల మధ్య సరిహద్దు వ్యవహారంలో ఎప్పటినుంచో ఉద్రిక్తత కొనసాగుతోంది. ముఖ్యంగా.. అరుణాచల్​ ప్రదేశ్​ తమదేనని చైనా చెబుతూ వస్తోంది. ఈశాన్య రాష్ట్రం.. తమ భూభాగం అని భారత్​ తేల్చిచెబుతోంది.

Asian games India : ఉషు అనే మార్షల్​ ఆర్ట్స్​ క్రీడలో అరుణచల్​ ప్రదేశ్​ నుంచి ముగ్గురు ప్లేయర్లు 2023 ఏషియన్​ గేమ్స్​కు ఎంపికయ్యారు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా.. వీరికి షాక్​ తగిలింది! చైనాలో ఎంట్రీ కోసం అక్రిడీషన్​ కార్డ్స్​ చాలా కీలకం. అలాంటిది.. ఒనిలు తెగ, ఎంపుంగ్​ లంగు ప్లేయర్లు.. తమ అక్రిడీషన్​ కార్డులను డౌన్​లోడ్​ చేసుకోలేక పోయారు. మూడో అరుణాచల్​ప్రదేశ్​ వాసి నెయ్​నమ్​ వంగ్సుకు అక్రిడీషన్​ కార్డు వచ్చినా.. ఆమెను హాంగ్​ కాంగ్​ దాటి ప్రయాణాలు చేయకూడదని షరుతులు విధించింది చైనా.

ఇదీ చూడండి:- Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఫ్లాగ్ బేరర్లు ఈ ఒలింపిక్ మెడలిస్టులే..

ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.

Asian games live updates 2023 : "చైనా చర్యలకు వ్యతిరేకంగా భారత్​ నిరసన వ్యక్తం చేస్తోంది. క్రీడాశాఖ మంత్రి తన చైనా ట్రిప్​ను రద్దు చేసుకుంటున్నారు. అరుణాచల్​ప్రదేశ్​లోని క్రీడాకారులను చైనా టార్గెట్​ చేస్తోంది. హంగ్జౌలో జరుగుతున్న 19వ ఏషియన్​ గేమ్స్​కు వారికి అక్రిడీషన్​ కార్డులు ఇవ్వలేదు. భారతీయులతో చైనా ఈ విధంగా ప్రవర్తిస్తుండటాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది. అరుణాచల్​ప్రదేశ్​ అనేది ఎప్పటికీ భారత్​లో భాగమే," అని విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిందమ్​ బగ్చి తెలిపారు.

"ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లాము. చాలా బలంగా మా వాదనలు వినిపించాము. కొందరు క్రీడాకారులను ఇలా నియంత్రించడం సరైనది కాదు. ఇది ఏషియన్​ గేమ్స్​ స్ఫూర్తికి విరుద్ధం," అని ఆరిందమ్​ బగ్చి వెల్లడించారు.

ఏషియన్​ గేమ్స్​..

ఈ మెగా ఈవెంట్లో కొన్ని పోటీలు ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ.. అసలు ఓపెనింగ్ ఈవెంట్​ మాత్రం శనివారం జరగనుంది. చైనాలో హాంగ్జౌ నగరం ఈసారి ఏషియన్ గేమ్స్ కు ఆతిథ్యమిస్తోంది. ఈసారి ఏషియన్ గేమ్స్ లో ఏకంగా 12 వేల మందికిపైగా అథ్లెట్లు పోటీ పడుతున్నారు. ఈ విషయంలో ఏషియన్​ గేమ్స్​.. ఒలంపిక్స్​నే మించిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం