Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఫ్లాగ్ బేరర్లు ఈ ఒలింపిక్ మెడలిస్టులే..-asian games 2023 india flag bearers are harmanpreet and lovlina ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఫ్లాగ్ బేరర్లు ఈ ఒలింపిక్ మెడలిస్టులే..

Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఫ్లాగ్ బేరర్లు ఈ ఒలింపిక్ మెడలిస్టులే..

Hari Prasad S HT Telugu
Sep 20, 2023 09:27 PM IST

Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌ 2023లో ఇండియా ఫ్లాగ్ బేరర్లుగా ఇద్దరు ఒలింపిక్ మెడలిస్టులను ఎంపిక చేశారు. హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ లకు ఈ గౌరవం దక్కనుంది.

ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్
ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Hockey India)

Asian Games 2023: ఏషియన్ గేమ్స్ 2023కు టైమ్ దగ్గర పడింది. వచ్చే శనివారం (సెప్టెంబర్ 23) నుంచి చైనాలో హాంగ్జౌలో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. దీంతో ఈసారి గేమ్స్ లో ఇండియా ఫ్లాగ్ బేరర్ల పేర్లను రివీల్ చేశారు ఇండియన్ టీమ్ చెఫ్ డె మిషన్ భూపేందర్ సింగ్ బజ్వా. చాలా చర్చ జరిగిన తర్వాత బుధవారం (సెప్టెంబర్ 20) దీనిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పీటీఐతో వెల్లడించారు.

టోక్యో ఒలింపిక్స్ లో మెడల్స్ గెలిచిన ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ ఈసారి ఫ్లాగ్ బేరర్లుగా ఉండనున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ ఇద్దరినీ ఎంపిక చేసినట్లు భూపేందర్ సింగ్ చెప్పారు. ఈసారి ఏషియన్ గేమ్స్ లో మొత్తం 655 మంది ఇండియన్ అథ్లెట్లు పాల్గొంటుండటం విశేషం.

ఏషియన్ గేమ్స్ ఇండియా నుంచి ఇంత మంది పాల్గొనడం ఇదే తొలిసారి. "ఈసారి ఇద్దరు ఫ్లాగ్ బేరర్లు భారత బృందాన్ని లీడ్ చేయనున్నారు. హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్" అని భూపేందర్ తెలిపారు. 2018 జకార్తా ఏషియన్ గేమ్స్ లో ఈ గౌరవం స్టార్ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ గెలిచిన నీరజ్ చోప్రాకు దక్కింది.

టోక్యో ఒలింపిక్స్ లో మెన్స్ హాకీ టీమ్ 40 ఏళ్ల తర్వాత బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. అటు మహిళల బాక్సింగ్ 69 కేజీల కేటగిరీలో లవ్లీనా కూడా బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇక ఈసారి వరల్డ్ వుమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో 75 కేజీల విభాగంలో ఆమె గోల్డ్ మెడల్ గెలిచింది. మరోవైపు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఈసారి హాంగ్జౌ గేమ్స్ లో గోల్డ్ మెడల్ పై కన్నేసింది.

Whats_app_banner