Asian Games 2023 Cricket schedule: ఏషియన్ గేమ్స్ 2023లో క్రికెట్ షెడ్యూల్ ఇదీ.. ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడంటే?-asian games 2023 cricket schedule india matches to be held on these dates ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asian Games 2023 Cricket Schedule: ఏషియన్ గేమ్స్ 2023లో క్రికెట్ షెడ్యూల్ ఇదీ.. ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడంటే?

Asian Games 2023 Cricket schedule: ఏషియన్ గేమ్స్ 2023లో క్రికెట్ షెడ్యూల్ ఇదీ.. ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu
Sep 19, 2023 02:55 PM IST

Asian Games 2023 Cricket schedule: ఏషియన్ గేమ్స్ 2023లో క్రికెట్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్లో ఇండియా మెన్స్, వుమెన్స్ టీమ్స్ ఆడుతుండగా.. రెండు జట్లూ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ లోనే తలపడతాయి.

రుతురాజ్ గైక్వాడ్
రుతురాజ్ గైక్వాడ్ (PTI)

Asian Games 2023 Cricket schedule: ఏషియన్ గేమ్స్ 2023కు టైమ్ దగ్గర పడింది. ఈ మెగా ఈవెంట్లో క్రికెట్ కూడా ఉన్న విషయం తెలిసింది. మంగళవారం (సెప్టెంబర్ 19) నుంచే ఈ గేమ్స్ లో క్రికెట్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 7 వరకు ఏషియన్ గేమ్స్ లో భాగంగా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయి. ఈసారి ఇండియా మెన్స్, వుమెన్స్ టీమ్స్ రెండూ మెడల్స్ కోసం తలపడబోతున్నాయి.

చైనాలోని హాంగ్జౌ ఈసారి ఏషియన్ గేమ్స్ కు ఆతిథ్యమిస్తోంది. ఈ గేమ్స్ లో భాగంగా వుమెన్స్ క్రికెట్ మ్యాచ్ లు ఈ మంగళవారం (సెప్టెంబర్ 19) నుంచి వచ్చే మంగళవారం (సెప్టెంబర్ 26) వరకూ జరుగుతాయి. ఇక పురుషుల క్రికెట్ విషయానికి వస్తే ఇవి సెప్టెంబర్ 28న మొదలై అక్టోబర్ 7న ముగుస్తాయి. ఈ క్రికెట్ మ్యాచ్ లన్నీ జెజియాంగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్లో జరుగుతాయి.

క్రికెట్ షెడ్యూల్ ఇదీ

ఈ ఏషియన్ గేమ్స్ లో ఇండియా మెన్స్ టీమ్ సెకండ్ రేట్ టీమ్ తో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని టీమ్ ఈ గేమ్స్ కోసం వెళ్తోంది. అయితే అటు మహిళల, ఇటు పురుషుల జట్లు రెండూ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ లోనే తలపడతాయి. అంతకుముందు మహిళల క్రికెట్ లో హాంకాంగ్, చైనా, నేపాల్, సింగపూర్, యూఏఈ, భూటాన్, థాయ్‌లాండ్, ఒమన్ లాంటి టీమ్స్ లీగ్ స్టేజ్ లో తలపడతాయి.

ఇండియా వుమెన్స్ టీమ్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో ఆడుతుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22న ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. హాంకాంగ్, చైనా, నేపాల్, సింగపూర్ లలో ఒక జట్టుతో ఇండియన్ వుమెన్స్ టీమ్ క్వార్టర్స్ ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సెప్టెంబర్ 25న సెమీఫైనల్లో ఆడాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 26న బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ మెడల్స్ కోసం మ్యాచ్ లు జరుగుతాయి.

మెన్స్ క్రికెట్ షెడ్యూల్ ఇదీ

ఇక ఇండియా పురుషుల జట్టు కూడా నేరుగా క్వార్టర్ ఫైనల్లోనే ఆడుతుంది. ఇండియాతోపాటు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ నేరుగా క్వార్టర్స్ లోనే ఆడనుండగా.. లీగ్ స్టేజ్ లో ఒమన్, సౌదీ అరేబియా, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, బహ్రెయిన్, నేపాల్, ఇండోనేషియా, ఖతార్, కువైట్, యూఏఈ, భూటాన్, చైనా, ఆఫ్ఘనిస్థాన్ తలపడతాయి.

ఇండియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 5న మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఆఫ్ఘనిస్థాన్, చైనా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ఇండియా క్వార్టర్స్ లో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. అక్టోబర్ 6న సెమీఫైనల్స్ మ్యాచ్ లు ఉంటాయి. ఇక ఫైనల్ అక్టోబర్ 7న జరగనుండగా.. అదే రోజు ఉదయం బ్రాంజ్ మెడల్ మ్యాచ్ కూడా జరుగుతుంది.