Lovlina Borgohain win Gold: భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం.. వరల్డ్ బాక్సింగ్‌లో లవ్లీనాకు పసిడి-lovlina borgohain bags gold at world boxing championship 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lovlina Borgohain Win Gold: భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం.. వరల్డ్ బాక్సింగ్‌లో లవ్లీనాకు పసిడి

Lovlina Borgohain win Gold: భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం.. వరల్డ్ బాక్సింగ్‌లో లవ్లీనాకు పసిడి

Lovlina Borgohain win Gold: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. లవ్లీనా బోర్గోహెయిన్ 75 కిలోల విభాగంలో పసిడిని సొంతం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో నాలుగు బంగారు పతకాలు వచ్చి చేరాయి.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు గోల్డ్ (PTI)

Lovlina Borgohain win Gold: న్యూదిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ స్వర్ణాల పంట పండిస్తోంది. ఇప్పటికే మూడు బంగారు పతకాలను సాధించిన ఇండియా.. తాజాగా మరో గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం సాయంత్రం తొలుత నిఖత్ జరీన్ స్వర్ణం సాధించగా.. తాజాగా లవ్లీనా బోర్గోహెయిన్ కూడా పసిడి కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించన లవ్లీనా తాజాగా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో 75 కిలోల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్ యాన పార్కర్‌పై 5-2 తేడాతో విజయం సాధించింది.

ఒపెనింగ్ రౌండులో ఇరువురు బాక్సర్లు హోరాహోరీగా పోటీ పడ్డారు. ఇద్దరు కేర్‌ఫుల్‌గా పంచ్‌లు విసురుతూ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఓపెనింగ్ రౌండు తర్వాత నెక్ అండ్ నెక్ ఫైట్‌లో లవ్లీనాకు గేమ్ అనుకూలంగా మారింది. స్వల్ప తేడాతో విజయం సాధించింది. రెండో రౌండ్‌లో కైత్లిన్ పుంజుకుంది. వరుస పంచులతో భారత బాక్సర్‌ను ఇబ్బంది పెట్టింది. దూకుడుగా ఆడి ఆ రౌండ్‌ను గెల్చుకుంది. ఆఖరిదైన మూడో రౌండులోనూ పార్కర్‌ అటాకింగ్ మోడ్‌లో ఆడింది. ఆ రౌండ్ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే కార్నర్‌కు నెట్టి పంచుల వర్షాన్ని కురిపించింది. అయితే ప్రత్యర్థి దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న లవ్లీనా జాబ్‌లతో దూకుడుగా ఆడింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలోనే ప్రత్యర్థి వరుస జాబ్‌లతో విరుచుకుపడింది. ఫలితంగా ఆ రౌండ్‌లో లవ్లీనా విజయం సాధించింది.

2018, 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాలు సాధించిన తర్వాత ఈ టోర్నీలో గోల్డ్ సాధించడం ఇదే తొలిసారి. ఆమెకు ఇది మొదటి స్వర్ణం. తాజా విజయంలో మహిళ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 4 స్వర్ణాలు సాధించినట్లయింది.

శనివారం జరిగిన తుదిపోరులో 48 కేజీల విభాగంలో నీతు గాంగాస్ 5-0 తేడాతో లుత్సాయిఖాన్‌ను(మంగోలియా) ఓడించగా.. ఆ తర్వాత 81 కేజీల విభాగంలో స్వీటి 4-3 తేడాతో వాంగ్ లీనాపై(చైనా) నెగ్గింది. ఆదివారం నాడు నిఖత్ జరీన్ 50 కిలోల విభాగంలో పసిడి గెలిచింది.

సంబంధిత కథనం

టాపిక్