Commonwealth Games 2022: బాక్సింగ్ లో అమిత్, నీతుకు గోల్డ్ మెడల్స్ రోహిత్ కు కాంస్యం-indian boxers amit panghal and nitu bags gold medals in cwg 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Commonwealth Games 2022: బాక్సింగ్ లో అమిత్, నీతుకు గోల్డ్ మెడల్స్ రోహిత్ కు కాంస్యం

Commonwealth Games 2022: బాక్సింగ్ లో అమిత్, నీతుకు గోల్డ్ మెడల్స్ రోహిత్ కు కాంస్యం

HT Telugu Desk HT Telugu
Aug 07, 2022 04:43 PM IST

కామన్వెల్త్ గేమ్స్ లో ఆదివారం భారత బాక్సర్లు సత్తా చాటారు. అమిత్ పంఘల్ నీతు గోల్డ్ మెడల్స్ దక్కించుకోగా రోహిత్ బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు.

అమిత్ పంఘల్
అమిత్ పంఘల్ (TWITTER/TEAMINDIA)

కామన్వెల్త్ గేమ్స్ లో ఆదివారం భారత బాక్సర్లు పతకాల పంట పడించారు.అమిత్ పంఘల్, నీతు గంగాస్ గోల్డ్ మెడల్స్ దక్కించుకోగా రోహిత్ టొకాస్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. బాక్సింగ్ 4548 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన నీతు కెనడా బాక్సర్ రెజ్టన్ ను 5 0 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నది. నీతు పంచ్ ల ముందు రెజ్టన్ పూర్తిగా తేలిపోయింది.

మరో మ్యాచ్ లో 51 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన స్టార్ బాక్సర్ అమిత్ పంఘల్ కూడా ఫైనల్ లో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ మెక్ డొనాల్డ్ ను 5 0 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. గత కామన్వెల్త్ గేమ్స్ లో అమిత్ పంఘల్ సిల్వర్ మెడల్దక్కించుకోగా ఈ సారి గోల్డ్ మెడల్ తో మెరిశాడు. మరో మ్యాచ్ లో 63.5 67 కేజీల కేటగిరిలో మరో భారత బాక్సర్ రోహిత్ టొకాస్బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు.

WhatsApp channel