Asian Games 2023: ఆ విషయంలో ఒలింపిక్స్‌నే మించిపోయిన ఏషియన్ గేమ్స్-asian games 2023 surpass olympics ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Asian Games 2023 Surpass Olympics

Asian Games 2023: ఆ విషయంలో ఒలింపిక్స్‌నే మించిపోయిన ఏషియన్ గేమ్స్

Hari Prasad S HT Telugu
Sep 22, 2023 12:47 PM IST

Asian Games 2023: ఒలింపిక్స్‌నే మించిపోయాయి ఏషియన్ గేమ్స్. శనివారం (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం 12 వేల మందికిపైగా అథ్లెట్లు మెడల్స్ కోసం పోటీ పడుతున్నారు.

ఏషియన్ గేమ్స్ కు ఆతిథ్యమివ్వనున్న చైనాలోని హాంగ్జౌ నగరం
ఏషియన్ గేమ్స్ కు ఆతిథ్యమివ్వనున్న చైనాలోని హాంగ్జౌ నగరం (HT_PRINT)

Asian Games 2023: ఏషియన్ గేమ్స్ మళ్లీ వచ్చేశాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో కొన్ని పోటీలు ఇప్పటికే ప్రారంభమైనా.. అసలు ఓపెనింగ్ సెర్మనీ మాత్రం శనివారం (సెప్టెంబర్ 23) జరగనుంది. చైనాలో హాంగ్జౌ నగరం ఈసారి ఏషియన్ గేమ్స్ కు ఆతిథ్యమిస్తోంది. ఈసారి ఏషియన్ గేమ్స్ లో ఏకంగా 12 వేల మందికిపైగా అథ్లెట్లు పోటీ పడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

దీంతో ఒలింపిక్స్ ను ఈ ఏషియన్ గేమ్స్ మించిపోయింది. వచ్చే ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్ లో 10500 మంది అథ్లెట్లు పార్టిసిపేట్ చేయనుండగా.. ఏషియన్ గేమ్స్ లో అంతకంటే ఎక్కువ మంది పాల్గొంటుండటం విశేషం. దీనికి ప్రధాన కారణంగా తాజా ఈవెంట్లో అథ్లెట్లు తలపడబోయే స్పోర్ట్స్, గేమ్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే.

ఒలింపిక్స్‌లోనూ లేని క్రీడలు ఇవే

ఈసారి ఏషియన్ గేమ్స్ లో ఒలింపిక్స్ లో లేని క్రీడలు కూడా ఉన్నాయి. అందులో క్రికెట్ కూడా ఒకటి. ఇదే కాకుండా స్క్వాష్, డ్రాగన్ బోట్ రేసింగ్, సెపక్‌తక్రా, వుషు, కబడ్డీ, జు జిత్సు, కురష్ లాంటి వాటితోపాటు బ్రిడ్జ్, చెస్ లాంటి మైండ్ స్పోర్ట్స్ కూడా ఈ ఏషియన్ గేమ్స్ లో ఉన్నాయి. ఇక ఒలింపిక్స్ కు అర్హత సాధించేందుకు ఈ ఏషియన్ గేమ్స్ ఉపయోగపడే 9 ఆటలు కూడా ఉండటం విశేషం.

ఆర్చరీ, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, బాక్సింగ్, బ్రేకింగ్, హాకీ, మోడ్రన్ పెంటథ్లాన్, సెయిలింగ్, టెన్నిస్, వాటర్ పోలోలాంటి ఆటల్లో ఏషియన్ గేమ్స్ ద్వారా ఒలింపిక్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఏషియన్ గేమ్స్ లో 481 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఈసారి ఇండియా నుంచి ఏకంగా 655 మంది అథ్లెట్ల బృందం మెడల్స్ వేటలో చైనాకు వెళ్లింది.

అయితే గత నాలుగు దశాబ్దాలుగా ఈ గేమ్స్ లో అత్యధిక మెడల్స్ సాధిస్తూ వస్తున్న చైనానే ఈసారి కూడా ఆధిపత్యం చెలాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018లో ఇండోనేషియాలో జరిగిన గేమ్స్ లో 300కుపైగా మెడల్స్ తో చైనా టాప్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, సౌత్ కొరియా ఉన్నాయి. అయితే ఈసారి కబడ్డీ, క్రికెట్ లాంటి స్పోర్ట్స్ రావడంతో వీటిల్లో ఇండియా మెడల్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.