T20 Cricket in Olympics: ఇకపై ఒలింపిక్స్‌లో క్రికెట్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?
T20 Cricket in Olympics: ఒలింపిక్ గేమ్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చేందుకు సన్నాహాలు జరుగుతోన్నాయి. 2028లో అమెరికాలోని లాస్ ఏంజిలాస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కు చోటు కల్పించబోతున్నట్లు సమాచారం.
T20 Cricket in Olympics: ఇకపై ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ ఆటగాళ్ల విన్యాసాల్ని చూడొచ్చు. సిక్సర్లు, ఫోర్ల మెరుపుల్ని వీక్షిస్తూ సంబరాలు చేసుకోవచ్చు. ఒలింపిక్స్ క్రీడల్లో టీ20 క్రికెట్‌ను చేర్చాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. 2028లో లాస్ ఎంజిలాస్‌లో జరుగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో కొత్తగా టీ20 క్రికెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
మెన్స్‌తో పాటు ఉమెన్స్ క్రికెట్ కు చోటు కల్పించబోతున్నట్లు తెలిసింది. 2028 ఒలింపిక్ క్రీడల్లో కొత్త క్రీడాంశాల చేర్పుకు సంబంధించి సెప్టెంబర్ 8న ఒలింపిక్ అసోషియేషన్ మీటింగ్‌ను ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిసింది. ఈ మీటింగ్‌లోనే టీ20 క్రికెట్ ను ఒలింపిక్ క్రీడల్లో చేర్చడంపై ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడకు పెరుగుతోన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. క్రికెట్ ఆడే అన్ని దేశాలకు కాకుండా వరల్డ్ వైడ్‌గా కేవలం ఐదు టీమ్‌లకు మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉండబోతున్నట్లు తెలిసింది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రతిపాదికన ఈ ఐదు టీమ్స్‌ను సెలెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2022లో మొదటిసారి కామన్‌వెల్త్ గేమ్స్‌ను ప్రయోగాత్మకంగా ఉమెన్స్ క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ గేమ్‌కు లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకొని ఒలింపిక్స్‌లో క్రికెట్ సక్సెస్ అవుతోందనే ఆలోచనలో ఒలింపిక్ కమిటీ ఉన్నట్లు చెబుతోన్నారు.