SBI cashback credit card: ఎస్‌బీఐ నుంచి క్యాష్ బ్యాక్ స్పెషల్ క్రెడిట్ కార్డ్
21 September 2022, 13:57 IST
SBI cashback credit card: ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సరికొత్త గా ప్రత్యేకంగా క్యాష్ బ్యాక్ కోరుకునేవారి కోసం క్రెడిట్ కార్డు తెచ్చింది.
The Cashback SBI card: ఎస్‌బీఐ తెచ్చిన సరికొత్త క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్
SBI cashback credit card: ఆన్‌లైన్‌లో ఏది కొన్నా 5 శాతం డిస్కౌంట్ వస్తే ఎంత బాగుంటుంది? క్యాష్ బ్యాక్ ప్రధాన అంశంగా ఎస్‌బీఐ సరికొత్తగా ప్రత్యేక క్రెడిట్ కార్డు తెచ్చింది. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇందుకు ఎలాంటి షరతులు ఉండవు.
వీసా ప్లాట్‌ఫామ్‌పై ‘క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్’ అన్ని వర్గాల కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. లావాదేవీలు సులభంగా, సింపుల్‌గా, నిరంతరాయంగా ఉండేలా చూస్తుంది. డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉండేలా చేస్తుంది. ఈ కార్డు ఆవిష్కరణతో రానున్న ఫెస్టివల్ సీజన్‌లో ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.
‘క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ మా కార్డ్ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేస్తుంది. కస్టమర్ల అవసరాలకు పరిష్కారం చూపే మా ప్రయత్నాలకు ఇది చక్కటి నిదర్శనంగా నిలుస్తుంది..’ అని ఎస్‌బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమర రామ మోహన్ రావు ఓ ప్రకటనలో వివరించారు.
CASHBACK SBI card: క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్ ప్రత్యేకతలు ఇవీ..
1. ఎస్‌బీఐ కార్డ్ స్ప్రింట్ యాప్ నుంచి కేవలం కొన్ని క్లిక్స్ ద్వారా టయర్ 2, టయర్ 3 సిటీస్‌లో కస్టమర్లు ఈ క్రెడిట్ కార్డు అందుకోవచ్చు.
2. క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్ మార్చి 2023లోగా తీసుకుంటే మొదటి ఏడాది ఎలాంటి రుసుము ఉండదు. ఇది ప్రత్యేక ఆఫర్. గరిష్టంగా ఒక బిల్ సైకిల్‌లో రూ. 10 వేల వరకు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. ఒక శాతం నుంచి మొదలై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
3. క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులో మీ క్యాష్ బ్యాక్ ఆటోమేటిక్‌గా క్రెడిట్ అవుతుంది. స్టేట్‌మెంట్ జనరేట్ అయిన రెండు రోజుల్లోపు ఈ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
4. క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఏడాదికి (క్వార్టర్లీ ఒకటి) నాలుగు సార్లు డొమెస్టిక్ ఎయిర్ పోర్టు లాంజ్‌లకు వెళ్లొచ్చు. అక్కడ ఫ్రీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. కావాల్సినంత సమయం కూర్చోవచ్చు. వాష్ రూమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
5. క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా 1 శాతం మేర ఫ్యూయల్ సర్‌ఛార్జ్ కూడా మినహాయింపు వర్తిస్తుంది. అయితే ఆ ట్రాన్సాక్షన్ రూ. 500 నుంచి రూ. 3 వేల వరకు ఉండాలి. గరిష్టంగా నెలకు రూ. 100 వరకు మినహాయింపు లభిస్తుంది.
6. క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై యాన్యువల్ రెన్యువల్ ఫీ రూ. 999గా ఉంటుంది. అయితే ఏడాదికి రూ. 2 లక్షల వరకు కొనుగోళ్లు చేస్తే ఉచితంగా రెన్యువల్ అవుతుంది.
7. అన్ని ఇతర యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, కొనుగోళ్లపై 1 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
8. అయితే రెంట్ పేమెంట్స్, పెట్రోలు బిల్లులు, వాలెట్ లోడ్స్, మర్చంట్ ఈఎంఐలు, క్యాష్ అడ్వాన్సెస్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, ఎన్‌క్యాష్, ఫ్లెక్సీపే వంటి వాటిపై క్యాష్ బ్యాక్ వర్తించదు.