తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Doctor Murder : ‘న్యూడ్స్​ పంపు..’- వైద్యురాలి హత్యకు ముందు మరోకరిని వేధించిన నిందితుడు!

Kolkata doctor murder : ‘న్యూడ్స్​ పంపు..’- వైద్యురాలి హత్యకు ముందు మరోకరిని వేధించిన నిందితుడు!

Sharath Chitturi HT Telugu

26 August 2024, 15:47 IST

google News
  • Sanjay Roy news : కోల్​కతా వైద్యురాలి హత్య కేసు దర్యాప్తులో మరో విషయం బయటపడింది. హత్యకు ముందు ప్రధాన నిందితుడు సంజయ్​ రాయ్​ రెడ్​ లైట్​ ఏరియాకి వెళ్లాడు. అనంతరం వీధుల్లో మరొకరిని వేధించాడు. చివరికి హాస్పిటల్​కి వచ్చాడు!

కోల్​కతా వైద్యురాలి హత్య కేసు ప్రధాన నిందితుడు..
కోల్​కతా వైద్యురాలి హత్య కేసు ప్రధాన నిందితుడు..

కోల్​కతా వైద్యురాలి హత్య కేసు ప్రధాన నిందితుడు..

కోల్​కతాలోని ఆర్​జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్​లో 31 ఏళ్ల డాక్టర్​పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ ఆదివారం నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్షలో నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. లై డిటెక్టర్ పరీక్ష సందర్భంగా సంజయ్ రాయ్ నేరానికి కొన్ని గంటల ముందు తన స్నేహితుడితో కలిసి రెడ్ లైట్ ఏరియాని సందర్శించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి తెలిపాడు. అయితే తాను సెక్సె్​ చేయలేదని పేర్కొన్నారు.

అక్కడి నుంచి బయటకు వచ్చిన అనంతరం వీధిలో మరొకరిని వేధించినట్లు సంజయ్ రాయ్ అంగీకరించాడని ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే ‘సోర్స్​’ ఆధారంగా నివేదికను ప్రచురించింది.

ఆ తర్వాత సంజయ్ రాయ్ తన గర్ల్​ఫ్రెండ్​కి వీడియో కాల్ చేసి ‘న్యూడ్​ ఫొటోలు’ పంపమని అడిగాడు.

ఇదీ చూడండి:- Kolkata doctor rape : సంజయ్​ రాయ్​పై లై డిటెక్టర్​ పరీక్ష- అసలు నిజం బయటపడిందా? నిందితుడు ఏం చెప్పాడంటే..

నేరం జరిగిన రోజు రాత్రి సంజయ్ రాయ్ తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించాడు. అనంతరం రెడ్ లైట్ ఏరియాకు బయలుదేరారు. అనంతరం దక్షిణ కోల్​కతాలోని మరో రెడ్ లైట్ ఏరియా చెట్లాకు వెళ్లారు. చెట్లాకు వెళ్తుండగా ఓ బాలికపై వేధింపులకు పాల్పడ్డారు.

అనంతరం కోల్​కతా వైద్యురాలి హత్య కేసు ప్రధాన నిందితుడు సంజయ్​ రాయ్​ తిరిగి ఆస్పత్రికి చేరుకున్నాడు. అనంతరం సంజయ్ రాయ్ ఉదయం 4.03 గంటలకు సెమినార్ హాల్ సమీపంలోని కారిడార్​కు వెళ్లాడు.

మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత అతను తన స్నేహితుడు, పోలీసు అధికారి అనుపమ్ దత్తా ఇంటికి వెళ్లాడు.

ఇదిలా ఉండగా సంజయ్ రాయ్ తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇచ్చాడని, వాటిని పాలీగ్రాఫ్ యంత్రం గుర్తించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.

నిందితుడి సైకోఅనలటిక్​ ప్రొఫైల్​ను సేకరించిన సీబీఐ అతను అశ్లీల చిత్రాలకు బాగా అలవాటు పడ్డాడని వెల్లడించింది. అతని ఫోన్​లో పలు పోర్న్ క్లిప్​లు కనిపించాయని తెలిపింది.

ఆగస్ట్​ 9న విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ హాల్ కు వెళ్లిన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆమె శరీరంపై గాయాలు కనిపించాయి.

అటు మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ పాత్రపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. శనివారం ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 12 గంటలకు పైగా ఎందుకు పట్టిందని సుప్రీంకోర్టు గత వారం కోల్​కతా పోలీసులను ప్రశ్నించింది. సందీప్ ఘోష్ అత్యాచారం, హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని పేర్కొంది. సందీప్ ఘోష్ పై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

నేరం తర్వాత సంజయ్ రాయ్ అత్యాచారం, హత్య చేసినట్లు అంగీకరించాడని కోల్​కతా పోలీసులు తెలిపారు. కానీ తనను ఇరికించారని, తాను నిర్దోషినని పేర్కొంటూ నిందితుడు యూటర్న్ తీసుకున్నాడు.

అత్యాచారం, హత్య గురించి తనకు ఏమీ తెలియదని సంజయ్ రాయ్ కొన్ని రోజుల క్రితం జైలు గార్డులకు చెప్పాడు. గత శుక్రవారం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టు ముందు కూడా ఇదే తరహా వాదనలు వినిపించారు.

తదుపరి వ్యాసం