తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Slippers Price: ఈ స్లిప్పర్స్ ధర రూ. 1 లక్ష మాత్రమే; ఎక్కడో తెలుసా..?

Slippers price: ఈ స్లిప్పర్స్ ధర రూ. 1 లక్ష మాత్రమే; ఎక్కడో తెలుసా..?

HT Telugu Desk HT Telugu

17 July 2024, 14:15 IST

google News
  • Slippers price: కింద ఫొటోలో కనిపిస్తున్న స్లిప్పర్స్ ను మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కదా. ఒకప్పుడు మనకు అవి రెగ్యులర్ వేర్. కానీ ఇప్పుడు చాలామంది బాత్రూం స్లిప్పర్స్ గా వాడుతుంటారు. ఇవి మన దగ్గర సుమారు రూ. 100 కి లభిస్తాయి. కానీ, అక్కడ మాత్రం అవి కొనాలంటే రూ. 1 లక్ష పెట్టాలట.

రూ. 1 లక్ష రూపాయల స్లిప్పర్స్
రూ. 1 లక్ష రూపాయల స్లిప్పర్స్

రూ. 1 లక్ష రూపాయల స్లిప్పర్స్

Saudi Arabia news: లగ్జరీ సంస్థలు కొన్ని సాధారణ ఉత్పత్తులను అధిక ధరలకు అమ్మడం మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాం. ఇవి తరచుగా ప్రజలను షాక్ కు గురిచేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి మరో అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ లో ప్రతీ చెప్పుల షాపులో సుమారు రూ. 100 కు లభించే బ్లూ అండ్ వైట్ స్లిప్పర్స్ ను సౌదీ అరేబియాలో 4,590 రియాల్స్ (సుమారు రూ.1,00,000)కు అమ్ముతున్నారు. అవును, మీరు చదివింది నిజమే.

వంద రూపాయల స్లిప్పర్లకు లక్ష రూపాయల ధర

ఈ స్లిప్పర్స్ ధరకు సంబంధించిన వీడియోను రిషి బాగ్రీ అనే యూజర్ ఎక్స్ లో షేర్ చేశారు. ‘మనం భారతీయులం ఈ చెప్పులను టాయిలెట్ పాదరక్షలుగా ఉపయోగిస్తాం’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి గాజు పెట్టె లోపలి నుంచి ఈ చెప్పులను బయటకు తీస్తున్నాడు. ఆ చెప్పులు ఎంత ఫ్లెక్సిబుల్ గా మరియు సౌకర్యవంతంగా ఉన్నాయో చూపిస్తాడు. ఈ క్లిప్ లో వాటిని ఏ రంగుల్లో విక్రయిస్తున్నారో కూడా చూడొచ్చు. ఆ స్లిప్పర్స్ పై ప్రైస్ ట్యాగ్ కూడా ఉంది. అది 4,590 రియాల్స్ గా చూపిస్తుంది. అంటే, ఆ స్లిప్పర్స్ ధర ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1 లక్ష రూపాయలు.

సోషల్ మీడియాలో వైరల్..

జులై 16న రిషి బాగ్రీ ఈ పోస్ట్ పెట్టారు. పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడియో దాదాపు 20 లక్షల వ్యూస్ సాధించింది. ఈ షేర్ కు అనేక లైకులు, కామెంట్లు కూడా వచ్చాయి. ఈ పాదరక్షల అధిక ధరలను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మరికొందరైతే భారతీయులకు ఇది మంచి వ్యాపార అవకాశం అని పేర్కొన్నారు. ‘‘భారతీయులు ఇక్కడ 100 రూపాయలకు చెప్పులను కొనుగోలు చేసి అక్కడ 4500 రియాల్ (1 లక్ష రూపాయలు) కు అమ్మేయాలి.1000 రెట్లు లాభం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి’’ అని ఒక యూజర్ పోస్ట్ చేశారు.

మంచి వ్యాపార అవకాశం

మరో ఎక్స్ యూజర్ ఫైజ్ ‘‘మీ వద్ద డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వస్తువులకు కూడా వేలాది రూపాయలు చెల్లిస్తారు’’ అని కామెంట్ చేశారు. "భారతీయ పాదరక్షల తయారీదారులకు ఇది వ్యాపార అవకాశం" అని మరో ఎక్స్ యూజర్ శుభమ్ వర్మ వ్యాఖ్యానించారు. ‘‘మా నాన్న, నా చిన్నప్పుడు నాకు ఇలాంటి కొత్త జత స్లిప్పర్లను ఇచ్చినప్పుడు నేను ఎంత సంతోషించానో నాకు గుర్తుంది. వాటిని నేను చాలా బాగా మెయింటైన్ చేసేదాన్ని. వాటిని రిన్ సబ్బుతో శుభ్రపరచడం వల్ల అవి తెల్లగా ఉండటానికి సహాయపడతాయి. జీవితం ఒకప్పుడు సింపుల్ గా ఉండేది’’ అని మరో యూజర్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు.

తదుపరి వ్యాసం