Google Photos to iCloud: మీ ఫొటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్ నుంచి ఆపిల్ ఐ క్లౌడ్ కు ఇలా సింపుల్ గా ట్రాన్స్ ఫర్ చేయండి-how to transfer your photos and videos from google photos to apple icloud in a few simple steps ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Photos To Icloud: మీ ఫొటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్ నుంచి ఆపిల్ ఐ క్లౌడ్ కు ఇలా సింపుల్ గా ట్రాన్స్ ఫర్ చేయండి

Google Photos to iCloud: మీ ఫొటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్ నుంచి ఆపిల్ ఐ క్లౌడ్ కు ఇలా సింపుల్ గా ట్రాన్స్ ఫర్ చేయండి

HT Telugu Desk HT Telugu
Jul 16, 2024 07:31 PM IST

కొత్తగా ఐ ఫోన్ లేదా ఏదైనా ఆపిల్ డివైజ్ కొన్నారా? ఆండ్రాయిడ్ నుంచి ఆపిల్ కు మారడం కొత్తగా ఉందా? ముఖ్యంగా గూగుల్ ఫోటోస్ నుండి ఆపిల్ ఐక్లౌడ్ కు మీ ఫోటోలు, వీడియోలను ట్రాన్స్ ఫర్ చేయడం కష్టంగా ఉందా? ఈ సింపుల్ స్టెప్స్ తో గూగుల్ ఫోటోస్ నుండి ఆపిల్ ఐక్లౌడ్ కు మీ ఫోటోలు, వీడియోలను ట్రాన్స్ ఫర్ చేసేయండి.

గూగుల్ ఫొటోస్ నుంచి ఆపిల్ ఐ క్లౌడ్ కు ఫొటోస్ ట్రాన్స్ ఫర్
గూగుల్ ఫొటోస్ నుంచి ఆపిల్ ఐ క్లౌడ్ కు ఫొటోస్ ట్రాన్స్ ఫర్ (Hindustan Times)

గూగుల్ ఫోటోస్ నుండి ఐక్లౌడ్ కు ముఖ్యమైన ఫొటోలను, వీడియోలను బదిలీ చేసే విషయంలో ఇబ్బంది పడుతున్నారా? ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి కొత్త టూల్ ను గూగుల్, ఆపిల్ ప్రవేశపెట్టాయి. ఈ డైరెక్ట్ ట్రాన్స్ ఫర్ పద్ధతి మాన్యువల్ డౌన్ లోడ్ లు, అప్ లోడ్ ల అవసరాన్ని తొలగిస్తుంది. దీనివల్ల చాలా సమయం, డేటా ఆదా అవుతుంది.

ఇందు కోసం మీరు ఈ స్టెప్స్ ఫాలో కావాలి..

  1. ఐక్లౌడ్ స్టోరేజీని చెక్ చేసుకోండి

గూగుల్ ఫొటోస్ నుంచి ఆపిల్ ఐక్లౌడ్ కు ట్రాన్స్ ఫర్ చేయడానికి ముందు, మీకు తగినంత ఐక్లౌడ్ స్టోరేజీ ఉందో లేదో ధృవీకరించడం చాలా అవసరం. మీ ఐ ఫోన్ లో అందుబాటులో ఉన్న స్టోరేజీని చెక్ చేయండి. అవసరమైతే, మీ ఐక్లౌడ్ స్టోరేజ్ ప్లాన్ ను అప్ గ్రేడ్ చేయండి.

2. ఐక్లౌడ్ డ్రైవ్ ను ఇనేబుల్ చేయండి

ఆపిల్ డివైజ్ లో ఐక్లౌడ్ > > సెట్టింగ్ లకు నావిగేట్ చేయండి. ఐక్లౌడ్ ఫోటోలు, ఐక్లౌడ్ డ్రైవ్ రెండింటినీ ఇనేబుల్ చేయండి.

3. గూగుల్ టేకౌట్ ను సందర్శించండి

వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ టేకౌట్ (takeout.google.com)కు వెళ్లండి. ఈ సైట్ ద్వారా గూగుల్ ఫోటోస్ తో సహా వివిధ గూగుల్ సేవల నుండి డేటాను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

4. గూగుల్ ఫోటోలను ఎంచుకోండి

అందుబాటులో ఉన్న డేటా రకాల జాబితా నుండి, "గూగుల్ ఫోటోలు" ఎంచుకోండి. దీనిద్వారా మీ ఫోటోలు, వీడియోలు మాత్రమే ట్రాన్స్ ఫర్ అవుతాయి.

5. ఐక్లౌడ్ లోకి ట్రాన్స్ ఫర్

గూగుల్ ఫొటోస్, వీడియోస్ ను ట్రాన్స్ ఫర్ చేయడానికి డెస్టినేషన్ గా ఐ క్లౌడ్ ను ఎంచుకోండి. ఈ ఆప్షన్ ద్వారా మీ ఫొటోస్, వీడియోస్ ను గూగుల్ ఫొటోస్ నుంచి నేరుగా మీ ఐక్లౌడ్ ఖాతాకు వెళ్తాయి.

6. మీ ఆపిల్ ఐడితో సైన్ ఇన్

మీ ఆపిల్ ఐడీతో సైన్ ఇన్ చేయండి. అడిగినప్పుడు, మీ ఆపిల్ ఐడి క్రెడెన్షియల్స్ ను నమోదు చేయండి. ఈ దశ మీ గూగుల్ ఫోటోస్ ఖాతాను మీ ఐక్లౌడ్ ఖాతాతో లింక్ చేస్తుంది. ఇది మీ మీడియా ట్రాన్స్ ఫర్ ను సులభం చేస్తుంది.

7. అవసరమైన అనుమతులివ్వండి

ట్రాన్స్ ఫర్ చేయడానికి అవసరమైన అనుమతులను మంజూరు చేయండి. తద్వారా మీ ఐక్లౌడ్ ఖాతాకు ఫోటోలు, వీడియోలను ట్రాన్స్ ఫర్ చేయడానికి గూగుల్ ను అనుమతిస్తుంది. గూగుల్ ఫొటోస్ లోని మీ మీడియా ఆపిల్ ఐ క్లౌడ్ కు ట్రాన్స్ ఫర్ కావడానికి ఈ అనుమతులు అవసరం.

8. ట్రాన్స్ ఫర్ ప్రక్రియను ప్రారంభించండి

గూగుల్ ఫొటోస్ లోని మీ మీడియాను ఆపిల్ ఐ క్లౌడ్ కు ట్రాన్స్ ఫర్ చేయడానికి ఆన్ స్క్రీన్ సూచనలను అనుసరించండి. గూగుల్ మీ మీడియాను ఐక్లౌడ్ కు బదిలీ చేయడం ప్రారంభిస్తుంది.

9. ఎక్స పోర్ట్ స్థితిని మానిటర్ చేయండి

ఆపిల్ డేటా మరియు గోప్యతా పేజీలో మీరు మీ ట్రాన్స్ ఫర్ లేదా ఎక్స్ పోర్ట్ పురోగతిని ట్రాక్ చేయవచ్చు. ట్రాన్స్ ఫర్ ప్రక్రియ సమయం మీ లైబ్రరీ పరిమాణాన్ని బట్టి మారుతుంది. ఇది గంట నుండి కొన్ని రోజుల వరకు కూడా పట్టవచ్చు. ట్రాన్స్ ఫర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు, అలాగే పూర్తయినప్పుడు ఆపిల్ మీ ఆపిల్ ఐడీ-అనుబంధ ఇమెయిల్ చిరునామాలకు ఈ మెయిల్ నోటిఫికేషన్లను పంపుతుంది. మీ మీడియా ట్రాన్స్ ఫర్ అయిన తరువాత ఏవైనా సమస్యలు తలెత్తితే లేదా ఫైళ్లు మిస్ అయితే, "Import from Google" అనే ఫోల్డర్ కోసం ఐక్లౌడ్ డ్రైవ్ ను చెక్ చేయాలి.