తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid | దిగొచ్చిన ‘ఆర్’​ వాల్యూ.. నాలుగో వేవ్​ లేనట్టే!

Covid | దిగొచ్చిన ‘ఆర్’​ వాల్యూ.. నాలుగో వేవ్​ లేనట్టే!

HT Telugu Desk HT Telugu

03 May 2022, 7:05 IST

google News
    • వారం రోజుల క్రితంతో పోల్చుకుంటే ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆర్​ వాల్యూ దిగొచ్చింది. కానీ ఇప్పటికీ దేశంలో ఆర్​ వాల్యూ 1 కన్నా ఎక్కువగానే ఉంది.
పండుగ వేళ కిక్కిరిసిపోతున్న మార్కెట్లు
పండుగ వేళ కిక్కిరిసిపోతున్న మార్కెట్లు (AP)

పండుగ వేళ కిక్కిరిసిపోతున్న మార్కెట్లు

Covid R value India | ఇండియాలో కొవిడ్​ నాలుగో వేవ్​పై భయాందోళనలను నెలకొన్న తరుణంలో.. దేశ ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగించే వార్త ఒకటి బయటకొచ్చింది. వారం రోజుల క్రితంతో పోల్చుకుంటే.. ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో కొవిడ్​ 'ఆర్'​ వాల్యూ కాస్త తగ్గింది.

సహజంగా ఆర్​ వాల్యూతో.. వైరస్​ను ఓ వ్యక్తి ఎంతమందికి వ్యాపింపజేస్తున్నడో లెక్కగట్టవచ్చు. ఆర్​ వాల్యూ 1 కన్నా తక్కువకు పడిపోతే.. మహమ్మారి దశ ముగిసినట్టు పరిగణిస్తారు.

కాగా మే 1 నాటికి.. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్​ వాల్యు 1 కన్నా ఎక్కువగా ఉంది. దేశంలో ఆర్​ వాల్యూ ప్రస్తుతం 1.13గా నమోదైంది.

పండగలతో ప్రమాదం..!

Covid fourth wave India | దేశవ్యాప్తంగా మంగళవారం ఈద్​, అక్షయ తృతీయ పండగలు జరగనున్నాయి. కొవిడ్​ ఆంక్షలతో రెండేళ్లుగా వెలవెలబోయిన మార్కెట్లు.. మంగళవారం కిటకిటలాడనున్నాయి.

ఈద్​ జరుపుకునేందుకు ముస్లింలు సన్నద్ధమవుతున్నారు. కాగా.. ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న అనేక మార్కెట్లు కిక్కిరిసిపోతున్నట్టు సమాచారం.

మరోవైపు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని హిందువుల విశ్వాసం. ఈసారి మంచి వ్యాపారం జరుగుతుందని మార్కెట్లు భావిస్తున్నాయి.

రెండు పండగలు ఒకేసారి రావడం, ఆంక్షలు కూడా లేకపోవడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగలతో కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు. టీకాలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం