Covid | ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో కొత్త 'వేవ్' తప్పదు..!
01 May 2022, 17:16 IST
ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్లతో కొత్త వేవ్ వచ్చే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. బీఏ.4, బీఏ.5 వేరియంట్లతో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో కొత్త వేవ్…?
Omicron sub variants | కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సబ్వేరియంట్లతో జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. యాంటీబాడీల(ఒకసారి ఒమిక్రాన్ సోకితే) నుంచి ఈ వేరియంట్లు తప్పించుకునే ప్రమాదం ఉందని గుర్తించినట్టు పేర్కొన్నారు. వీటి వల్ల కొవిడ్ కొత్త వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే.. టీకాలు తీసుకున్న వారిలో వీటి ప్రభావం తక్కువగానే ఉంటుందని స్పష్టం చేశారు.
ఒమిక్రాన్‌కు చెందిన బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్లతో ఉత్పన్నమవుతున్న పరిస్థితులను.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గత నెల నుంచి పర్యవేక్షిస్తోంది. కాగా.. వీటిపై దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఒమిక్రాన్ బారినపడిన 39మంది రక్తనమూనాలను సేకరించారు. వీరిలో 15మంది టీకాలు తీసుకున్నారు. 24మంది వ్యాక్సిన్లు తీసుకోలేదు. టీకాలు తీసుకున్న వారిలో అధిక రక్షణ ఉందని తేలింది. కానీ.. వారిలో రక్తం మాత్రం తగ్గిపోయింది.
ఒమిక్రాన్ అసలు వేరియంట్ బీఏ.1తో పోల్చుకుంటే.. టీకాలు తీసుకోని ప్రజలకు బీఏ.4, బీఏ.5 సోకితే.. వారిలో యాంటీబాడులు దారుణంగా పడిపోయాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ పరిణామాలతో దక్షిణాఫ్రికాలో 5వ వేవ్.. ఊహించిన దానికన్నా వేగంగా వచ్చే అవకాశం ఉంది. బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్లకు చెందిన కేసులు గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు కారణం.
దక్షిణాఫ్రికాలోని 60మిలియన్ మందిలో ఇప్పటివరకు 30శాతం మంది మాత్రమే టీకాలు తీసుకోవడం గమనార్హం. ఫలితంగా వైద్యులు, ప్రజల్లో తీవ్రస్థాయి భయాందోళనలు నెలకొన్నాయి.
టాపిక్