తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Covid Xe Variant | ఆ లక్షణాలు మీలో ఉంటే.. వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండి..

Covid XE Variant | ఆ లక్షణాలు మీలో ఉంటే.. వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండి..

HT Telugu Desk HT Telugu

26 April 2022, 12:32 IST

google News
    • కొవిడ్​ 19 ఎక్స్​ఈ వేరియంట్ లక్షణాలేంటో తెలుసుకుని జాగ్రత్త పడటం ముఖ్యమంటున్నారు వైద్యులు. వైరస్​ లక్షణాలను ఆదిలోనే గుర్తించి.. వాటిని అడ్డుకుంటే.. ఆ మహమ్మారి తీవ్రత నుంచి తప్పించుకోవచ్చంటున్నారు. ఆ లక్షణాలేంటో మీరు తెలుసుకుని జాగ్రత్త వహించండి.
కరోనా ఎక్స్​ఈ వేరియంట్ లక్షణాలు
కరోనా ఎక్స్​ఈ వేరియంట్ లక్షణాలు

కరోనా ఎక్స్​ఈ వేరియంట్ లక్షణాలు

Covid XE Variant Symptoms |మహమ్మారి.. కొవిడ్ 19 ఎక్స్​ఈ వేరియంట్​ రూపంలో మళ్లీ మనముందుకు వచ్చింది. చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు. మన శరీరంలో ఆకస్మికంగా మార్పులు చోటు చేసుకుంటే.. కచ్చితంగా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే అంటున్నారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుని మీరు జాగ్రత్తగా ఉండండి.

చర్మం చికాకు: ఇటీవల మీ చర్మంపై ఏదైనా దద్దుర్లు లేదా రంగు మారడాన్ని గమనించారా? అయితే మీరు కొవిడ్-19 ఎక్స్​ఈ వేరియంట్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందనడానికి సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో స్కిన్ ఇరిటేషన్, ముఖ్యంగా మంట దీనికి సంకేతాలు కావొచ్చు.

కడుపు సమస్యలు: మీ గట్ అకస్మాత్తుగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు మీకు అనిపిస్తుందా? మీరు ఎసిడిటీ, మలబద్ధకం, విరేచనాలతో బాధపడుతున్నారా? మీరు మంచి ఆహారం తీసుకున్నా ఈ సమస్య వచ్చిందంటే.. మీ బాధకు వెంటనే పరిష్కారం కనుగొనలేకపోతే.. అది కొవిడ్ ఎక్స్​ఈకి సంకేతమే కావొచ్చు. ఈ భయంకరమైన వైరస్ సంకేతాలలో జీర్ణశయాంతర బాధ కూడా ఒకటి.

శ్వాస సమస్యలు: కొవిడ్-19 మునుపటి వేరియంట్‌లలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనేలా చేసింది. ఈ ఎక్స్​ఈ వేరియంట్​లలో కూడా శ్వాస ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా మీ శ్వాస విధానం మారినా.. కొంచెం దూరం నడిచి వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నా.. వెంటనే మీరు కరోనా-19 పరీక్ష చేయించుకోండి.

జ్వరం: జ్వరం అనేది మన శరీరంపై దాడి చేసే వైరస్ నుంచి మనల్ని రక్షించే సమయంలో వస్తుంది. మీకు జ్వరం వచ్చినట్లయితే, ప్రత్యేకించి అది మరీ ఎక్కువగా లేకుంటే.. కరోనా టెస్ట్ చేయించుకోండి. దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా.

గొంతు నొప్పి: మీ శ్వాసకోశ ఇబ్బందులు కరోనా వైరస్​ ద్వారా ప్రభావితమవుతాయి. దీని కారణంగా మీ గొంతులో నొప్పి, దురద, కఫం కూడా అనుభవించవచ్చు. మీకు ఇలాంటి ఇబ్బందులే ఎదురైతే.. వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం