covid: కరోనా ఫోర్త్ వేవ్.. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి!
01 May 2022, 17:15 IST
- కరోనా ఫోర్త్ వేవ్ భయాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఓమిక్రాన్.. దాని సబ్‌వేరియంట్‌లు ప్రపంచాన్ని మళ్ళీ ఆంక్షల గుప్పిట్లో నెడుతున్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్ టీకాలు వేసుకున్న వారిని కూడా వదలడం లేదు.
Corona Virus
కరోనా సంక్షోభం ముగిసేలా కనిపించడం లేదు. మహమ్మారి పీడ విరగడయ్యిందని కాస్త రిలాక్సయ్యామో లేదో తిరిగి ఒక్కసారిగా కేసులు పెరగడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. గత నెలలో దేశ వ్యాప్తంగా కరోనాకు సంబంధించిన దాదాపు అన్ని ఆంక్షలు ఎత్తివేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ అనేక నగరాల్లో అంక్షలు మెుదలయ్యాయి. కరోనా ఫోర్త్ వేవ్ భయాల నేపథ్యంలో నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఓమిక్రాన్.. దాని సబ్‌వేరియంట్‌లు ప్రపంచాన్ని మళ్ళీ ఆంక్షల గుప్పిట్లో నెడుతున్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్ టీకాలు వేసిన వారిని కూడా వదలడం లేదు. వ్యాక్సినేషన్ అయిన వారు కూడా కరోనా ప్రభావం చూసడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని కరోనా హాని కలిగిస్తుంది.
కరోనా కొందరిలో స్వల్ప లక్షణాలతో తొందరగా తగ్గిపోతుంటే.. మరికొందరిని దీర్ఘకాలం వేధించవచ్చు. కరోనా కేసుల్లో 30 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించవని CDC అభిప్రాయపడింది . COVID-19 సాధారణ లక్షణాలలో జ్వరం, పొడి దగ్గు, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారటం, శరీర నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. సాదరణంగా కొన్ని ప్రధాన లక్షణాలతో బాధపడుతున్న వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
హృదయ సంబంధ రోగులకు కరోనా ప్రమాదం
కరోనా హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాస్తవానికి, కరోనా అనేది శ్వాసకోశ వ్యాధి, అయితే ఈ వైరస్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) అభిప్రాయపడింది.
రోగనిరోధక శక్తి లేని వ్యక్తులపై తీవ్ర ప్రభావం
రోగనిరోధక శక్తి లేని వ్యక్తులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి.
స్థూలకాయంతో బాధపడేవారిపై కరోనా ప్రభావం
తీవ్రమైన కరోనా వ్యాధికి స్థూలకాయంతో భాదపడేవారిపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు గుర్తించాయి. ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న వ్యక్తల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ప్రాణాంతక వైరస్‌పై పోరాడటంలో శరీరంలో విఫలమవుతుంది.
టాపిక్