తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya Ram Mandir : మోదీ చేతుల మీదుగా.. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ..

Ayodhya Ram Mandir : మోదీ చేతుల మీదుగా.. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ..

Sharath Chitturi HT Telugu

22 January 2024, 13:46 IST

google News
    • Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాముడికి పట్టువస్త్రాలు సమర్పించారు.
మోదీ చేతుల మీదుగా.. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ..
మోదీ చేతుల మీదుగా.. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ..

మోదీ చేతుల మీదుగా.. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ..

Ayodhya Ram Mandir Live : కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది! శతాబ్దాల పాటు జరిగిన నిరీక్షణకు తెరపడింది. 'జై శ్రీరామ్​.. జై శ్రీరామ్​' నినాదాల మధ్య అయోధ్య రామ మందిరాన్ని సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం.. రామ్​ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలను.. రామజన్మ భూమి ప్రాంగణంతో పాటు టీవీల్లో లైవ్​ టెలికాస్ట్​ ద్వారా వీక్షించి.. లక్షలాది మంది భారతీయులు పులకరించారు.

సర్వాంగ సుందరంగా అయోధ్య..

శతాబ్దాల కలను నెరవేర్చుకునేందుకు.. సోమవారానికి దాదాపు 10-15 రోజుల ముందు నుంచే అయోధ్యలో హడావుడి మొదలైంది. ఇక సమయం దగ్గరపడుతున్న కొద్ది.. అయోధ్యవాసుల్లో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే.. ఈవెంట్​ కోసం అయోధ్య నగరం.. సర్వాంగ సుందరంగ ముస్తాబైంది.

ఇక సోమవారం ఉదయం నుంచి అయోధ్యలో హడావుడి, ఆసక్తి, తారస్థాయికి చేరాయి. ప్రముఖల రాకతో ఎయిర్​పోర్టులు, రోడ్డు మార్గాలు కిక్కిరిసిపోయాయి. సినీ తారల నుంచి మాజీ, ప్రస్తుత క్రికెటర్ల వరకు.. అందరు ఉదయాన్నే రామ జన్మభూమి ప్రాంగణానికి చేరుకున్నారు.

Ayodhya Ram Mandir Pran Pratishta live : మెగాస్టార్​ చిరంజీవి, మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​లు సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అయోధ్యకు వెళ్లారు. స్థానిక అధికారులు.. వారికి స్వాగతం పలికారు. ఇక బాలీవుడ్​ సెలబ్రిటీలు.. అమితాబ్​ బచ్చన్​- అభిషేక్​ బచ్చన్​, రణ్​బీర్​ కపూర్​- ఆలియా భట్​, కట్రినా కైఫ్​- విక్కీ కౌసల్​, కంగన రనౌత్​, మాధురీ దీక్షిత్​తో పాటు ఇతరులు కూడా రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు.

ఆలయం ప్రాంగణంలో.. ప్రముఖ సింగర్​ సోను నిగమ్​ ఆలపించిన 'రామ్​ సియ రామ్​' పాటతో.. రామ నామ స్మరణతో ప్రజలు పరవసించి పోయారు.

ప్రాణ ప్రతిష్ఠ జరిగింది ఇలా..

సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయం లోపలికి వెళ్లారు ప్రధాని మోదీ. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరిగింది. రాముడికి పట్టువస్త్రాలు సమర్పించారు మోదీ. పూజల్లో.. మోదీతో పాటు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్​, ఉత్తర్​ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​​ సైతం పాల్గొన్నారు.

అనంతరం బాల రాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు మోదీ. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన అనంతరం.. దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు.

దేశ నలుమూల రామ నామం..

Ayodhya Ram Mandir news : అయోధ్యలో ఓవైపు ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనగా.. ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు.. దేశం నలుమూలల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ మందిర ప్రారంభోత్సవాన్ని లైవ్​లో వీక్షించారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు విపక్ష నేతలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

PM Modi Ayodhya Ram Mandir : కాగా.. దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి! న్యూయార్క్​ టైమ్​ స్క్వేర్​లో రాముడి చిత్రాన్ని ప్రదర్శించారు. రాముడి జెండాలతో స్థానిక భారతీయులు.. పండుగ చేసుకున్నారు.

తదుపరి వ్యాసం