Crime news : పాకిస్థాన్‌లో హిందూ బాలిక దారుణ హత్య.. గ్యాంగ్ రేప్ చేసి..!
08 October 2023, 16:30 IST
Crime news : పాకిస్థాన్‌లో.. హిందూ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కొందరు దుండగులు.. చివరికి ఆమెను చంపేశారు. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది.
పాకిస్థాన్‌లో హిందూ బాలిక దారుణ హత్య.. గ్యాంగ్ రేప్ చేసి..!
Pakistan crime news : పాకిస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హిందూ బాలిక దారుణ హత్యకు గురైంది. దాని కన్నా ముందు.. కొందరు వ్యక్తులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
పాకిస్థాన్‌లో ఛోలిస్తాన్ ఎడారి ప్రాంతంలోని ఖాసిమ్ వాలా బంగ్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు.. అర్ధరాత్రి వేళ బాత్రూమ్ కోసం బయటకు వెళ్లిందని, ఆ తర్వాత కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి తెలిపారు. ఆమె కిడ్నాప్‌కు గురైందని ఆరోపించారు.
Hindu girl killed in Pakistan : కాగా.. గురువారం నాడు బాలిక మృతదేహం.. భుట్ట కెనాల్ వద్ద కనిపించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా.. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిపోతున్న నేరాలు..
పాకిస్థాన్‌లో నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా మైనారిటీలపై అఘాయిత్యాలు ఆందోళనకరంగా మారాయి. హిందూ బాలికలు, మహిళలు.. మత మార్పిడి, రేప్, బలవంత పెళ్లిళ్లకు గురవుతున్నారు.
Pakistan crime latest news : 2023 తొలి రెండు నెలల డేటా ప్రకారం.. పాకిస్థాన్‌లోని హిందువులపై నేరాలకు సంబంధించి 42 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ నెంబర్ పెరిగి ఉంటుందని తెలుస్తోంది. వీటిల్లో 6 కిడ్నాప్ కేసులు, బలవంతపు పెళ్లి, మత మార్పిడి వంటి నేరాలు ఉన్నాయి. కాగా.. 9 కేసుల్లో హిందువుల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయి.
'నరకం అనుభవిస్తున్నా..'
పాకిస్థాన్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక.. తన తండ్రిని చంపేసింది. తనను రేప్ చేస్తున్నాడని, తాను నరకం అనుభవిస్తున్నానని.. అందుకే సొంత తండ్రిని చంపేశానని బాలిక చెప్పింది.
Daughter kills father in Pakistan : పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ గుజ్జార్పురా ప్రాంతంలో గత నెలలో జరిగింది ఈ ఘటన. ఓ వ్యక్తి గత మూడు నెలలుగా తన కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమె వయస్సు 14ఏళ్లు. ఆమె ఒక మైనర్. కాగా.. ఆ బాలిక, తండ్రి వేధింపులను భరించలేకపోయింది. అతడిని చంపేద్దామని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. తుపాకీతో అతడిని కాల్చిచంపేసింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.