Daughter kills father : 'నరకం అనుభవిస్తున్నా'- రేపిస్ట్ తండ్రిని తుపాకీతో కాల్చి చంపిన మైనర్
Pakistan crime news : తండ్రి తన మీద అత్యాచారానికి పాల్పడుతున్నాడన్న కారణంతో ఓ బాలిక.. అతడిని తుపాకీతో కాల్చి చంపేసింది. మూడు నెలలుగా నరకం అనుభవిస్తున్నట్టు పోలీసులకు వివరించింది. ఈ ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది.
Daughter kills father : పాకిస్థాన్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి, తన కూతురుపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తుండగా, అతడిని ఆమె కాల్చి చంపేసింది!
ఇదీ జరిగింది..
పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ గుజ్జార్పురా ప్రాంతంలో శనివారం జరిగింది ఈ ఘటన. ఓ వ్యక్తి గత మూడు నెలలుగా తన కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమె వయస్సు 14ఏళ్లు. ఆమె ఒక మైనర్.
కాగా.. ఆ బాలిక, తండ్రి వేధింపులను భరించలేకపోయింది. అతడిని చంపేద్దామని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. తుపాకీతో అతడిని కాల్చిచంపేసింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Girl kills father : "మూడు నెలలుగా నా మీద అత్యాచారం చేస్తున్నాడు. నరకం అనుభవిస్తున్నాను. నా రేపిస్ట్ తండ్రిని చంపేశాను. తుపాకీతో కాల్చి చంపేశాను," అని ఆ బాలిక.. పోలీసులకు చెప్పింది.
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టిన అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Father rapes daughter : మరో కేసులో.. మైనర్ కూతురిని రేప్ చేసిన కారణంతో ఓ వ్యక్తికి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన ఒక రోజు తర్వాతే.. గుజ్జార్పురాలో ఆ బాలిక, తన తండ్రిని తుపాకీతో చంపేసింది.
ఇదీ చూడండి:- Crime news : మహిళపై గ్యాంగ్ రేప్- విషం తాగి ఆత్మహత్య చేసుకున్న దంపతులు! ముగ్గురు బిడ్డలు..
ఇండియాలోనూ..!
పాకిస్థాన్లోనే కాదు.. మహిళలు, బాలికలపై అత్యాచారానికి సంబంధించిన ఘటనలు ఇండియాలో కూడా ఎక్కువగానే వార్తల్లో నిలుస్తున్నాయి. ముగ్గురు మహిళలు, వారి కుటుంబసభ్యుల కళ్ల ముందే అత్యాచారానికి గురైన ఘటన హరియాణాలో ఇటీవలే కలకలం సృష్టించింది.
హరియాణాలోని పానిపట్లో బధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. నలుగురు సభ్యుల గ్యాంగ్ ఒకటి.. ఓ ఇంట్లోకి చొరబడింది. కుటుంబంలో కొందరి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేశారు దుండగులు. అనంతరం వారి ఎదురుగానే.. ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
ఆ తర్వాత.. దుండగులు ఈ ఇంట్లో నుంచి డబ్బులు, నగలను దొంగలించి అక్కడి నుంచి పారిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం