Woman raped: గర్భిణిపై మామ అత్యాచారం; ఇక నువ్వు నాకు తల్లి వరుస అవుతావంటూ వదిలేసిన భర్త-pregnant woman raped by father in law husband abandons her in muzaffarnagar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Woman Raped: గర్భిణిపై మామ అత్యాచారం; ఇక నువ్వు నాకు తల్లి వరుస అవుతావంటూ వదిలేసిన భర్త

Woman raped: గర్భిణిపై మామ అత్యాచారం; ఇక నువ్వు నాకు తల్లి వరుస అవుతావంటూ వదిలేసిన భర్త

HT Telugu Desk HT Telugu
Sep 14, 2023 05:18 PM IST

Woman raped: ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడు నెలల గర్భిణిపై సొంత మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. మామ చేసిన దారుణం గురించి భర్తకు చెబితే.. ‘బలవంతంగానైనా నా తండ్రి నీతో సంబంధం పెట్టుకున్నాడు కనుక.. ఇక నువ్వు నాకు తల్లి వరుస’ అని చెప్పి ఆ బాధితురాలిని ఆ భర్త ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Pregnant woman raped: సొంత మామ 7 నెలల గర్భంతో ఉన్న కోడలిపైననే అత్యాచారం చేసిన ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది.

కొట్టి, చంపేస్తానని బెదిరించి..

26 ఏళ్ల గర్భిణి పై అదే ఇంట్లో ఉండే మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను కొట్టి, బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘాతుకాన్ని ఆ యువతి తన భర్తకు చెప్పుకుంది. కానీ, ఆ భర్త మరింత అన్యాయంగా వ్యవహరించాడు. ఆ యువతిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. పైగా ‘నా తండ్రి బలవంతంగానైనా సరే నీతో సంబంధం పెట్టుకున్నాడు కనుక. ఇక నుంచి నువ్వు ఆయన భార్యవు. ఇక నువ్వు నాకు తల్లి వరుస అవుతావు. మన మధ్య భార్యాభర్తల సంబంధం ఇక ఉండదు’ అని ఆ బాధితురాలిని ఇంట్లో నుంచి పంపించేశాడు. దాంతో, ఆ యువతి తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. అనంతరం, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి, పోలీసు కేసు పెట్టింది.

డబ్బు కోసమే..

దాంతో, పోలీసులు కేసు నమోదు చేసి, ఆ యువతి భర్త, మామలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, తనపై వచ్చిన అత్యాచారం ఆరోపణలను ఆ తండ్రి కొట్టిపారేస్తున్నాడు. తమ వద్ద నుంచి డబ్బు గుంజడానికే ఆ యువతి తనపై అత్యాచారం ఆరోపణలు చేస్తోందని బుకాయిస్తున్నాడు. గతంలో కూడా ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. 2005 లో ఒక యువతిని తన మామ రేప్ చేశాడు. స్థానిక పంచాయతి పెద్దలు ఆ యువతి తన మామనే ఇకపై భర్తగా భావించాలని, తాళి కట్టిన భర్తను కొడుకుగా చూసుకోవాలని తీర్పునిచ్చారు.

Whats_app_banner