Crime news : మహిళపై గ్యాంగ్​ రేప్​- విషం తాగి ఆత్మహత్య చేసుకున్న దంపతులు! ముగ్గురు బిడ్డలు..-hours after wifes gang rape up couple die by consuming poison ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : మహిళపై గ్యాంగ్​ రేప్​- విషం తాగి ఆత్మహత్య చేసుకున్న దంపతులు! ముగ్గురు బిడ్డలు..

Crime news : మహిళపై గ్యాంగ్​ రేప్​- విషం తాగి ఆత్మహత్య చేసుకున్న దంపతులు! ముగ్గురు బిడ్డలు..

Sharath Chitturi HT Telugu
Sep 24, 2023 09:45 AM IST

Crime news : ఉత్తర్​ ప్రదేశ్​లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అది తట్టుకోలేక.. ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు బిడ్డలు అనాథలైపోయారు!

మహిళపై గ్యాంగ్​ రేప్​- విషం తాగి ఆత్మహత్య చేసుకున్న దంపతులు!
మహిళపై గ్యాంగ్​ రేప్​- విషం తాగి ఆత్మహత్య చేసుకున్న దంపతులు!

Crime news : ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ముగ్గురు బిడ్డలను అనాథలు చేసి.. భార్యాభర్తలు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు.. ఆ మహిళపై సామూహిక ఆత్మహత్య జరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది!

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​ బస్తి జిల్లాలోని ఓ గ్రామంలో.. ఓ 30ఏళ్ల వ్యక్తి.. తన 27ఏళ్ల భార్యతో నివాసముంటున్నాడు. వీరికి ముగ్గురు బిడ్డలు. కుమారుల వయస్సు 8ఏళ్లు- ఆరేళ్లు. వీరికి ఏడాది వయస్సు ఉన్న ఆడ బిడ్డ కూడా ఉంది.

UP crime news : కాగా.. సెప్టెంబర్​ 20 అర్ధరాత్రి వేళ వీరి ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనను ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. మరుసటి రోజు పిల్లలు స్కూలుకు రెడీ అవుతుండగా.. వీరిద్దరు విషం తాగేశారు. గదిలో నుంచి బయటకు వచ్చి.. తాము చచ్చిపోతున్నామని పిల్లలకు చెప్పారు.

ఇదీ చూడండి:- Acid attack : దిల్లీలో దారుణం.. కోడలిపై అత్త యాసిడ్​ దాడి!

UP rape case : ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిని పరిశీలిస్తుండగా.. ఫోన్​లో వారికి ఒక వీడియో లభించింది. విషం తాగే ముందు.. ఆ దంపతులు ఆ వీడియోను రికార్డ్​ చేశారు. తమ చావుకు కారణం 25ఏళ్ల ఆదర్శ్​, 45ఏళ్ల త్రిలోకి అని ఇద్దరు పేర్లు చెప్పారు. తనపై వారిద్దరు సామూహిక అత్యాచారం చేశారని ఆ మహిళ కన్నీరు పెట్టుకుంది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ఇద్దరిని వెంటనే అరెస్ట్​ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. సెక్షన్​ 376డీ, 306 కింద కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మృతుడి భూమి విక్రయం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు తేలిందని అధికారులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం