Acid attack : దిల్లీలో దారుణం.. కోడలిపై అత్త యాసిడ్ దాడి!
Acid attack in Delhi : కోడలిపై ఓ మహిళ యాసిడ్తో దాడి చేసిన ఘటన దిల్లీలో కలకలం సృష్టించింది. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Delhi acid attack : దేశ రాజధాని దిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలిపై ఓ మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది!
ఇదీ జరిగింది..
దిల్లీ పోలీసుల ప్రకారం.. న్యూ ఉస్మాన్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి అత్త అంజలి.. ఆమెపై యాసిడ్ పోసింది. 25శాతం కాలిన గాయాలతో బాధితురాలు జేపీసీ ఆసుపత్రిలో చేరింది. అక్కడి నుంచి ఆమెను లోక్ నాయక్ జై ప్రకాశ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతోంది.
కోడలిపై యాసిడ్ దాడి ఘటన అనంతరం బాధితురాలి అత్త, ఇతర కుటుంబసభ్యులు పారిపోయారు. కాగా.. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం.. సంత్ నగర్ బురారిలో అంజలిని అరెస్ట్ చేశారు. ఇతర కుటుంబసభ్యులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. మరోవైపు అంజలిపై ఐపీసీ సెక్షన్ 323, 326ఏ, 34 కింద వివిధ కేసులు నమోదు చేశారు పోలీసులు.
Delhi crime news : ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బాధితురాలికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమెకు 6 నెలల బిడ్డ కూడా ఉంది. కాగా.. కుటుంబసభ్యులతో, ముఖ్యంగా అత్తతో ఆమెకు ఇబ్బందులు ఉన్నాయి.
"ఉస్మాన్పూర్లోని ఓ ఇంట్లో వీరందరు ఉంటున్నారు. కింద ఫ్లోర్లో అత్త ఉంటుంది. రెండో అంతస్తులో కోడలు ఉంటుంది. వీరి మధ్య గొడవలు ఉన్నాయి. కర్కర్దోమా కోర్టులో ఓ కేసు కూడా నడుస్తోంది. సెప్టెంబర్ 20న.. అందరు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. అంజలి కోపంతో ఊగిపోయింది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో.. ఇంట్లో ఉన్న కోడలి దగ్గరకు వెళ్లి, ఆమెపై యాసిడ్ పోసింది. బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి," అని ఉస్మాన్పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.
Acid attack on woman in Delhi : ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, ఇతరులను కూడా అరెస్ట్ చేసి విచారిస్తామని వెల్లడించారు పోలీసులు.
కోడలిని చంపిన అత్త…!
దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ కలహాలకు మహిళలు బలైపోతున్నారు. కొడుకు చేసుకున్న పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ఓ మహిళ, తన కోడలిని చంపించిన ఘటన నోయిడాలో ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
Mother in law kills woman : నోయిడాలోని బ్రిజ్ విహార్ కాలనీలో ఈ ఘటన జరిగింది. సోనీ అనే 27ఏళ్ల మహిళ.. మౌసమ్ కుమార్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. కాగా.. ఈ నెల 5న సోనీ ఒంటరిగా ఉన్న సమయంలో.. ఇద్దరు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. మహిళను తుపాకీతో కాల్చి చంపేశారు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు మౌసమ్ కుమార్. సోనీ మొదటి భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం