Rajasthan rape case : మహిళపై సామూహిక అత్యాచారం.. సాయం కోసం నగ్నంగా రోడ్డు మీద..!
Rajasthan rape case ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు.. నగ్నంగా రోడ్డు మీద సాయం కోసం ప్రయత్నం చేయాల్సి వచ్చింది!
Rajasthan rape case : రాజస్థాన్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నగ్నంగా ఉన్న ఆ మహిళ.. రోడ్డు మీద సాయం కోసం గంటల పాటు ప్రయత్నించినా, ఎవరూ పట్టించుకోలేదని సమాచారం!
ఇదీ జరిగింది..
రాజస్థాన్ బిల్వారాలో శనివారం జరిగింది ఈ ఘటన. సంబంధిత మహిళకు నిందితుల్లోని ఓ వ్యక్తితో పరిచయం ఉంది. కాగా.. కలుద్దామని అతను మహిళకు ఫోన్ చేశాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. కొన్ని గంటల తర్వాత.. రాత్రి 7:30 ప్రాంతంలో ఆ మహిళ బయటకు వాకింగ్‌కు వెళ్లింది. ఇంతలో ఓ బైక్ ఆమెను అడ్డుకుంది. బైక్ నడిపిన ఇద్దరు ఆమెను కిడ్నాప్ చేశారు.
మహిళను కిడ్నాప్ చేసిన నిందితులు.. ఆమెను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. అక్కడ ఆమెను భౌతికంగా హింసించారు. అనంతరం ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు.
Woman raped in Rajasthan : నిందితుల నుంచి మహిళ తప్పించుకుని ఎలాగో అలా బయటపడింది. కానీ ఆమె బట్టలు వారి దగ్గరే ఉండిపోయాయి. నగ్నంగా రోడ్డు మీదకు వచ్చిన మహిళ.. సాయం కోసం ప్రాధేయపడింది. కానీ ఆమె మానసిక స్థితి బాగోలేదని భావించి, ఎవరు ఆమెను పట్టించుకోలేదు.
ఇదీ చూడండి:- Three disabled minors raped: అంధ విద్యార్థినులపై పదేళ్లుగా అత్యాచారం; నిందితుల అరెస్ట్
కొంతసేపటి తర్వాత.. బాధితురాలిని కొందరు గ్రామస్థులు చూశారు. ఆమెకు బట్టలు ఇచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మహిళ ఉన్న చోటుకు వెళ్లారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు ఆధారాల సేకరణకు వెళ్లారు. పగిలిపోయిన గాజులు, మహిళను కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన బైక్‌ను గుర్తించారు.
Rajasthan crime news : కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి పేర్లు చోటూ (42), గిరిధర్ (30). మూడో వ్యక్తిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.
మరోవైపు.. బాధితురాలికి న్యాయం చేయాలని, డీసీపీ కార్యాలయం ఎదుట శనివారం రాత్రి ధర్నా చేపట్టారు స్థానికులు. నిందితులను కఠినంగా శిక్షించి, మహిళకు న్యాయం చేస్తామని పోలీసులు హామీనిచ్చారు.
సంబంధిత కథనం