UP crime news : ఆ బాక్స్‌లో.. సగం కాలిపోయిన మహిళ మృతదేహం- రేప్ చేసి చంపేశారా?
UP crime news : యూపీలో ఓ బాక్స్‌లో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె శరీరం సగం కాలిపోయింది. దుండగులు.. ఆమెను రేప్ చేసి చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
UP crime news : ఉత్తర్ ప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాక్స్‌లో సగం కాలిపోయిన మహిళ మృతదేహం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆమెను రేప్ చేసి, చంపేసి ఉంటారని ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్ భదోహిలోని జాతీయ రహదారి 19 లాల్ నగర్ టోల్ ప్లాజా వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. ఓ టిన్ బాక్స్ నుంచి వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. ఆ టిన్ బాక్స్‌ను తెరిచి చూసి, ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందులో ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఆ శరీరం సగం కాలిపోయింది!
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. దుండగులు.. ఆమెను మర్డర్ చేసే ముందు, తల నుంచి నడుము వరకు పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
UP rape case : "చూస్తుంటే.. మహిళ వయస్సు 20ఏళ్లు ఉండొచ్చని అనిపిస్తోంది. ఆమె శరీరం నడుము భాగం వరకు కాలిపోయింది. ఆమె కాళ్లు తాడుతో కట్టి ఉన్నాయి. మర్డర్ చేసే ముందు పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఉంటారు. ఫోరెన్సీక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్.. ఘటనాస్థలానికి వెళ్లి పరీక్షలు చేపట్టాయి. ముందు అసలు ఆ మహిళ ఎవరో తెలుసుకోవాలి. ఆమె ఐడెంటిటీని కనుక్కునేందుకు చర్యలు తీసుకున్నాము. ఆమె తెల్లను డ్రెస్ ధరించింది," అని పోలీసులు మీడియాకు వివరించారు.
ఇదీ చూడండి:- UP crime news : యూపీలో బాలిక కిడ్నాప్.. నెలన్నర పాటు రేప్!
అయితే.. మర్డర్‌కి ముందు రేప్ జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు, నివేదిక బయటకు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. బాధితురాలిని గుర్తించిన తర్వాత, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.
85ఏళ్ల వృద్ధురాలిపై..
దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వృద్ధులను కూడా విడిచిపెట్టడం లేదు! 85ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా దిల్లీలో కలకలం సృష్టించింది. బాధితురాలు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో..నిందితుడు చొరబడి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం