Crime news : ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం.. కుటుంబసభ్యుల ముందే!
Haryana crime news : ముగ్గురు మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. నిందితులు.. మహిళలను, వారి కుటుంబసభ్యుల ముందే రేప్ చేశారు!
Haryana crime news : హరియాణాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు దండగులు.. ముగ్గురు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ముందే.. మహిళలను రేప్ చేశారు!
ఇదీ జరిగింది..
హరియాణాలోని పానిపట్‌లో బధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. నలుగురు సభ్యుల గ్యాంగ్ ఒకటి.. ఓ ఇంట్లోకి చొరబడింది. కుటుంబంలో కొందరి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేశారు దుండగులు. అనంతరం వారి ఎదురుగానే.. ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
Haryana gang rape case : ఆ తర్వాత.. దుండగులు ఈ ఇంట్లో నుంచి డబ్బులు, నగలను దొంగలించి అక్కడి నుంచి పారిపోయారు.
మరో ఇంట్లో కూడా..!
కాగా.. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత, కొన్ని కిలోమీటర్ల దూరంలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు.. ఓ ఇంట్లోకి చొరబడ్డారు. అనారోగంతో బాధపడుతున్న మహిళను దారుణంగా కొట్టారు. ఆమె భర్తపైనా దాడి చేశారు. అనంతరం.. ఈ ఇంట్లో నుంచి విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
కాగా.. ఈ ఘటనలో బాధిత మహిళ ప్రాణాలు కోల్పోయింది.
ఈ రెండు ఘటనల విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ రెండింటికీ ఒకటే గ్యాంగ్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
"రెండు ఘటనలు ఒకే గ్రామంలో జరిగాయి. దర్యాప్తు చేపట్టాము. ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ ఈ రెండింటికీ ఒకటే ముఠా కారణమని భావిస్తున్నాము. నిందితులను తొందరలోనే పట్టుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాము," అని మట్లౌడా పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.
పెళ్లి చేసుకుంటానని..
Delhi rape case : దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఓ మహిళతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్న ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. బాధితురాలు.. సదరు వ్యక్తిపై రేప్ కేసు పెట్టింది.
22ఏళ్ల బాధితురాలు.. మూడేళ్ల క్రితం లక్ష్మణ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడే.. నఫీస్ అహ్మెద్ అనే హెడ్ కానిస్టేబుల్‌తో పరిచయం అయ్యింది. కొంతకాలానికే వారిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. 2021లో అహ్మెద్.. ఆమెకు ప్రొపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు. ఇలా కొంత కాలం గడిచింది.
నఫీస్ అహ్మెద్కు పీసీఆర్‌లో పోస్టింగ్ వచ్చింది. అప్పటి నుంచి మహిళతో మాట్లాడటం తగ్గించాడు. ఇది గమనించిన మహిళ.. అతడిని నిలదీసింది. వివాహం చేసుకోనని తేల్చిచెప్పాడు. అతడి గురించి ఆరా తీయగా.. కానిస్టేబుల్‌కు అప్పటికే పెళ్లి అయ్యిందని, నలుగురు పిల్లలు ఉన్నారని తెలుసుకుని షాక్ అయ్యింది. ఈ నేపథ్యంలో.. నిందితుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
సంబంధిత కథనం