Crime news : బాలికను చంపి.. మృతదేహంతో శృంగారం చేసిన ముగ్గురు అరెస్ట్!
Crime news : అసోంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను ఓ వ్యక్తి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం.. ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె మృతదేహంతో శృంగారం చేశాడు!
Assam Crime news : అసోంలో ఇటీవలే కలకలం సృష్టించిన ఓ బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాలికను చంపిన నిందితులు.. మృతదేహంతో శృంగారం చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
అసోంలోని కరీమ్గంజ్ పట్టణంలో జరిగింది ఈ ఘటన. బాధిత మైనర్.. కొన్ని రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. కరీమ్గంజ్ బైపాస్ దగ్గర ఈ నెల 9న ఓ మృతదేహం లభించింది. ఆ మృతదేహం తమ బిడ్డదేనని బాధిత బాలిక తల్లిదండ్రులు ధ్రువీకరించారు.
Necrophilia case in Assam : మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పుడే ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఇదొక నెక్రోఫీలియా కేసు అని పోస్టుమార్టం నివేదికలో తేలింది. నెక్రోఫీలియా అంటే.. తొలుత చంపి, ఆ తర్వాత మృతదేహంతో శృంగారం చేయడం! ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులకు కొన్ని రోజుల క్రితం ఓ క్లూ దొరికింది. బాలిక వ్యక్తిగత డైరీలో ఓ ఫోన్ నెంబర్ లభించింది. అందులో ఓ ఫోన్ నెంబర్ కనిపించింది. అది ఓ రైల్వే ఉద్యోగి నెంబర్ అని తెలిసింది. ఆ వ్యక్తి- బాలిక రిలేషన్లో ఉన్నట్టు తెలుసుకున్నారు.
ఇదీ చూడండి:- Minor raped in MP: చిన్నారిపై అత్యాచారం; రక్తమోడుతున్నా స్పందించని జనం
Girl killed and raped in Assam : "రైల్వే ఉద్యోగంలో కొత్తగా చేరిన ఓ వ్యక్తితో బాలిక రిలేషన్లో ఉంది. భౌతికంగా కలవాలని అతను ఫోర్స్ చేసేవాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. చాలాసార్లు రిజెక్ట్ చేసింది. ఈ నెల 9న.. ఆ మైనర్ ఒంటరిగా ఇంట్లో ఉందని ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి అక్కడికి వెళ్లాడు. శృంగారం గురించి అడిగాడు. ఆమె మళ్లీ ఒప్పుకోలేదు. కోపంతో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత.. ముగ్గురు కలిసి, ఆమె మృతదేహంతో సెక్స్ చేశారు!" అని పోలీసులు వెల్లడించారు.
మృతదేహంతో శృంగారం చేసిన తర్వాత.. దానిని బైపాస్కు సమీపంలో పడేసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
Necrophilia cases in India : ప్రస్తుతం.. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత కథనం