తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : 5ఏళ్ల బిడ్డను రోడ్డుపై పడేసిన తల్లి- అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన చిన్నారి!

Crime news : 5ఏళ్ల బిడ్డను రోడ్డుపై పడేసిన తల్లి- అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన చిన్నారి!

Sharath Chitturi HT Telugu

07 October 2023, 6:40 IST

google News
    • US crime news : తల్లి రోడ్డు మీద పడేసిన 5ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది..
5ఏళ్ల బిడ్డను రోడ్డుపై పడేసిన తల్లి- చిన్నారిని రేప్​ చేసి, చంపిన వ్యక్తి!
5ఏళ్ల బిడ్డను రోడ్డుపై పడేసిన తల్లి- చిన్నారిని రేప్​ చేసి, చంపిన వ్యక్తి!

5ఏళ్ల బిడ్డను రోడ్డుపై పడేసిన తల్లి- చిన్నారిని రేప్​ చేసి, చంపిన వ్యక్తి!

US crime news : అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 5ఏళ్ల చిన్నారిని, ఆమె తల్లి రోడ్డు మీద పడేసింది. కొన్ని రోజులకే.. ఆ చిన్నారిని ఓ వ్యక్తి రేప్​ చేశాడు. ఆమె మరణించింది!

ఇదీ జరిగింది..

అమెరికాలోని కన్సాస్​లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసముండే ఓ మహిళ.. కొన్ని రోజుల క్రితం తన కుటుంబసభ్యులను ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది. వారందరు.. నిరాశ్రయలు ఉండే క్యాంప్​లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్యాంప్​.. మహిళ ఇంటికి ఒక మైలు దూరంలో ఉంది.

కాగా.. అక్టోబర్​ 2న.. 5ఏళ్ల జోయ్​ ఫెలిక్స్​ను కొందరు పెట్రోల్​ స్టేషన్​కు సమీపంలో గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయి. తీవ్రంగా రక్తం పోతుండటాన్ని గమనించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె మార్గం మధ్యలోనే మరణించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మైకెల్​ చెర్రీ అనే వ్యక్తి.. చిన్నారిని రేప్​ చేసినట్టు తెలుసుకున్నారు. అతడిని అరెస్ట్​ చేశారు. కాగా.. నిందితుడు, బాధిత చిన్నారి నివాసంలోనే ఉండేవాడు. చిన్నారి తల్లికి, నిందితుడికి మధ్య ఏమైనా రిలేషన్​ ఉందా? అన్న విషయంపై క్లారిటీ లేదు.

5 year old girl raped : అయితే.. జోయ్​ ఫెలిక్స్​ జీవితం ఎప్పుడు అంధకారంలో ఉండేదని తెలుస్తోంది. బాధిత చిన్నారి తల్లి, ఆమెను సరిగ్గా చూసుకునేది కాదని స్థానికులు పోలీసులకు చెప్పారు.

"జోయ్​ని ఆమె తల్లి ఎప్పుడు పట్టించుకోలేదు. చిన్న పిల్ల ఎప్పుడు బయటే తిరుగుతూ ఉండేది. అశుభ్రంగా ఉండేది. చుట్టుపక్కన వారు ఆమెకు సాయం చేసేవారు. బట్టలు, భోజనం వంటివి ఇచ్చేవారు. జోయ్​ స్కూల్​కి కూడా వెళ్లేది కాదు," అని ఓ స్థానికుడు మీడియాకు చెప్పాడు.

"జోయ్​.. సాయం కోసం చుట్టుపక్కన ఇళ్లకు వెళ్లేది. 'నేను ఇక్కడ పడుకోవచ్చా? నాకు భోజనం పెడతారా?' అని అడిగేదు. ఇలా.. వేరే ఇళ్లకు వెళుతోందంటే.. సొంత ఇంట్లో ఏదో సమస్య ఉన్నట్టే కదా!" అని మరో వ్యక్తి వివరించాడు.

Girl raped in US : జోయ్​ తల్లి.. తన కుటుంబసభ్యులతో సరిగ్గా ఉండేది కాదు. 2018లో పుట్టిన మరో బిడ్డపై పదునైన కత్తితో హింసకు పాల్పడింది. అప్పట్లో ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. మహిళను అధికారులు.. 18 నెలల పాటు పర్యవేక్షణలో పెట్టారు.

జోయ్​ తల్లి.. కుటుంబసభ్యులను ఎందుకు బయటకు పంపించేసింది? అన్న విషయంపై అధికారులు స్పందించలేదు. ఆమెను అరెస్ట్​ చేశారా? లేదా? అన్నది కూడా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.

తదుపరి వ్యాసం