Road accident : ఫ్లైఓవర్ మీద నుంచి పడిన బస్సు- ఐదుగురు మృతి, 40మందికి గాయాలు..
17 April 2024, 9:30 IST
Odisha road accident : ఒడిశాలో ఓ బస్సు ఫ్లైఓవర్ మీద నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 40మందికి గాయాలయ్యాయి.
ఘటనాస్థలంలో సహాయక చర్యలు..
Odisha bus accident today : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు.. ఫ్లైఓవర్ మీద నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 40మంది గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
ఒడిశా జాజ్పూర్లో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ్ బెంగాల్‌లోని హాల్దియా నుంచి పూరీకి వెళుతోంది ఆ బస్సు. రాత్రి 9 గంటల ప్రాంతంలో.. ఒడిశా రోడ్డు ప్రమాదానికి గురైన ఆ బస్సు.. ఎన్‌హెచ్16లోని బారాబతి బ్రిడ్జ్ ఎక్కింది. కొన్ని క్షణాలకే.. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి కిందపడిపోయింది.
Bus falls off flyover : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీసి, సహాయక చర్యలు చేపట్టారు.
"బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నాము. ఒడిశా రోడ్డు ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. గాయపడిన వారిని.. కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజ్‌కి తరలించాము. క్షతగాత్రులు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు," అని ధర్మశాలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తపన్ కుమార్ నాయక్ మీడియాకు వివరించారు.
ఒడిశా రోడ్డు ప్రమాదం సమయంలో సంబంధిత బస్సులో 47మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. క్రేన్ సాయంతో ఆ బస్సును పైకి లాగారు. గ్యాస్ కట్టర్స్ సాయంతో.. మెటల్ని కట్ చేసి, సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.
Odisha road accident today : కాగా.. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఐడెంటిటీని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కానీ.. బస్సులో ఉన్న వారిలో చాలా మంది.. పశ్చిమ్ బెంగాల్వాసులను వివరించారు.
ఒడిశా రోడ్డు ప్రమాదం ఘటనపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
Odisha bus accident death toll : "బారాబతి వీధి ఫ్లైఓవర్ నుంచి బస్సు కింద పడిన ఘటన విని నాకు చాలా బాధ కలిగింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను," అని నవీన్ పట్నాయక్.. ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
కారుపై మృతదేహంతో..
AP road accident : దేశంలో రోడ్డు ప్రమాదాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. వీటన్నింటి మధ్య.. ఇటీవలే ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో మద్యం మత్తులో ఉన్న ఇన్నొవా డ్రైవర్ మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ ధాటికి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు ఎగిరి కారుపై పడ్డాడు. తీవ్ర రక్తస్రావడంతో ప్రాణాలు విడిచాడు. అయినా ఆ విషయాన్ని కారు డ్రైవర్ గుర్తించలేదు. చివరికి.. ఇన్నొవా వాహనంపై యువకుడి మృతదేహంతోనే 18కి.మీ దూరం ప్రయాణించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.