Hyderabad News : విషాదం మిగిల్చిన వీకెండ్ ట్రిప్, కారు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి!-hyderabad crime news in telugu software employees car met accident two died ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News : విషాదం మిగిల్చిన వీకెండ్ ట్రిప్, కారు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి!

Hyderabad News : విషాదం మిగిల్చిన వీకెండ్ ట్రిప్, కారు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి!

HT Telugu Desk HT Telugu
Apr 15, 2024 03:40 PM IST

Hyderabad News : సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వీకెండ్ ట్రిప్ విషాదం మిలిగ్చింది. ఓ రిసార్ట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి చెందారు.

కారు ప్రమాదంలో  సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి
కారు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి

Hyderabad News : హైదరాబాద్(Hyderabad) లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు(Software Employees)గా పనిచేస్తున్న స్నేహితులు.....వీకెండ్(Weekend Trip) రావడంతో సరదాగా గడిపేందుకు ఓ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ తోటి స్నేహితులతో కలిసి వీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. అర్ధరాత్రి సమయంలో తిరుగు ప్రయాణంలో వేగంగా వెళుతున్న వీరి కారు (Car Accident)అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా....మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం....కాకినాడ ప్రాంతానికి చెందిన గౌతం సాయి(24), ఆనంద్ (30), సూర్య తేజ (27), ప్రకాష్(26), తనూజ (25) స్నేహితులు. గచ్చిబౌలి ప్రాంతంలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వీరంతా ఉద్యోగం చేస్తున్నారు. శనివారం, ఆదివారం వీకెండ్ హాలిడేస్ కావడంతో.... సూర్య తేజ తన కారులో గౌతం సాయి, ఆనంద్, ప్రకాష్, తనూజలను తీసుకొని శంషాబాద్ ప్రాంతంలోని రిసార్ట్ వెళ్లారు.

డివైడర్ ను ఢీకొని

రాత్రి 2 గంటల ప్రాంతంలో గచ్చిబౌలి(Gachibowli)కి తిరుగు ప్రయాణం కాగా.... హిమాయత్ సాగర్ వద్ద అదుపు తప్పిన కారు(Car Accident) డివైడర్ ను ఢీ కొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టడంతో వెనుక డోర్ తెరుచుకుంది. డోర్ పక్కనే కూర్చున్న ఆనంద్, గౌతం సాయి కింద పడిపోయి స్పాట్ లోనే మరణించారు. కారులో ఉన్న ఎయిర్ బెలూన్(Air Bags) లు తెరుచుకోవడంతో సూర్యతేజ, ప్రకాష్, తనూజలు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాదంతో ఆ రహదారిపై దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టిప్పర్ లారీ ఢీ కొని వ్యక్తి మృతి

బైక్ పై(Bike Accident) వెళుతున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి టిప్పర్ లారీ బలంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కళాకాల గ్రామంలో నివాసం ఉంటున్న రాము తన కూతురితో కలిసి పని మీద మేడ్చల్(Medchal) కు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే మార్గమధ్యలో అతని బైక్ ను టిప్పర్ వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న రాము తలకు బలంగా గాయం అవడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం నుంచి రాము కూతురు సురక్షితంగా బయట పడింది. టిప్పర్ లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

IPL_Entry_Point

సంబంధిత కథనం