Govt Jobs 2024 : పోస్టుల భర్తీకి హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రకటన - భారీగా వేతనం, ముఖ్య వివరాలివే
ECIL Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని ఈసీఐఎల్(ECIL) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 13వ తేదీతో అప్లికేషన్ల గడువు పూర్తి కానుంది. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి….
మెECIL Hyderabad Recruitment 2024 : హైదరాబాద్‌లోని ఈసీఐఎల్(ECIL Hyderabad) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలే మూడుకుపైగా నోటిఫికేషన్లు ఇచ్చిన ఈసీఐఎల్…. మరో రిక్రూట్ మెంట్ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏడు ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… ఏప్రిల్ 13వ తేదీతో పూర్తి కానుంది. 27 ఏళ్ల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారని ప్రకటనలో స్పష్టం చేసింది. రాతపరీక్ష, ఇంటర్వూతో పాటు గ్రూప్ డిస్కషన్ వంటివి ఉంటాయి. https://www.ecil.co.in/jobs.html వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హులైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన -ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్(ECIL, Hyderabad).
ఉద్యోగాలు -ట్రైనీ ఆఫసర్ పోస్టులు.
మొత్తం ఖాళీలు - 07.
అర్హతలు - సీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి - 27 ఏళ్ల లోపు ఉండాలి.
జీతం - రూ. 40 వేల నుంచి రూ.1,40,000.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లోనే దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు - రూ. 1000 చెల్లించాలి.
దరఖాస్తుల సమర్పణకు తుది గడువు - ఏప్రిల్ 13, 2024.
ఎంపిక విధానం - రాత పరీక్ష, ఇంటర్వూ ఉంటుంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
హాల్ టికెట్ల తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/home.html
అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే jarait.j@ecil.co.in/ లేదా madhaviaurorab@ecil.co.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Electronics Corporation of India Limited) లో14 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈసీఐఎల్(ECIL) ప్రాజెక్టు పనుల్లో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారు పని చేయాల్సి ఉంటుంది. మార్చి 23వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 13వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. 32 ఏళ్ల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన -ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్
- ఉద్యోగాలు - డిప్యూటీ మేనేజర్(టెక్నికల్)
- మొత్తం ఖాళీలు - 14
- అర్హతలు - ఇంజినీరింగ్ , పీజీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు. పూర్తిస్థాయి నోటిపికేషన్ లో ఈ వివరాలను చూడొచ్చు.
- వయోపరిమితి - 32 ఏళ్ల లోపు ఉండాలి.
- జీతం - రూ. 50 వేల నుంచి రూ.1,60,000.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాలి.
- దరఖాస్తు రుసుం - రూ. 1000 చెల్లించాలి.
- దరఖాస్తులు ప్రారంభం - మార్చి 23, 2024.
- దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఏప్రిల్ 13, 2024.
- ఆన్ లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ హార్డు కాపీని డిప్యూటీ జనరల్ మేనెజర్, ఈసీఐఎల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, హైదరబాద్ - 500062 చిరునామాకు పోస్టు చేయాలి.
- హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 20, 2024.
- ఎంపిక విధానం - విద్యార్హత, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వూలు కూడా ఉంటాయి.
- ఇంటర్వూ తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/home.html