ECIL Hyderabad : హైదరాబాద్ ఈసీఐఎల్ లో ఉద్యోగాలు - రూ. 50 వేలకుపైగా జీతం, దరఖాస్తు తేదీలివే
ECIL Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా డిప్యూటీ మేనెజర్ (టెక్నికల్) పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మార్చి 23వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ఇECIL Recruitment 2024 : హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Electronics Corporation of India Limited) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా….. మొత్తం 14 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేడర్ ను బట్టి జీతభత్యాలు ఉంటాయి. ఈసీఐఎల్(ECIL) ప్రాజెక్టు పనుల్లో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారు పని చేయాల్సి ఉంటుంది. మార్చి 23వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 13వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. 32 ఏళ్ల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు. https://www.ecil.co.in/jobs.html వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన -ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్
- ఉద్యోగాలు - డిప్యూటీ మేనేజర్(టెక్నికల్)
- మొత్తం ఖాళీలు - 14
- అర్హతలు - ఇంజినీరింగ్ , పీజీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు. పూర్తిస్థాయి నోటిపికేషన్ లో ఈ వివరాలను చూడొచ్చు.
- వయోపరిమితి - 32 ఏళ్ల లోపు ఉండాలి.
- జీతం - రూ. 50 వేల నుంచి రూ.1,60,000.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాలి.
- దరఖాస్తు రుసుం - రూ. 1000 చెల్లించాలి.
- దరఖాస్తులు ప్రారంభం - మార్చి 23, 2024.
- దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఏప్రిల్ 13, 2024.
- ఆన్ లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ హార్డు కాపీని డిప్యూటీ జనరల్ మేనెజర్, ఈసీఐఎల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, హైదరబాద్ - 500062 చిరునామాకు పోస్టు చేయాలి.
- హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 20, 2024.
- ఎంపిక విధానం - విద్యార్హత, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వూలు కూడా ఉంటాయి.
- ఇంటర్వూ తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/home.html
కింద ఇచ్చిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో అన్ని వివరాలను చూడొచ్చు….
NRSC Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(National Remote Sensing Centre) లో పలు ఉద్యోగాల(Recruitment) భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 71 కొలువులను భర్తీ చేయనున్నారు. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ప్రక్రియ మార్చి 18వ తేదీతో ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగియనుంది. https://www.nrsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన -నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NSRC), హైదరాబాద్
ఉద్యోగ ఖాళీలు - 71
ఖాళీల వివరాలు - రిసెర్చ్ సైంటిస్ట్ - 20, జూనియర్ రిసెర్చ్ ఫెలో 27, ప్రాజెక్ట్ సైంటిస్ట్-I - 06, ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి - 04 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్-I 02, ప్రాజెక్ట్ అసోసియేట్-II - 12 ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు.
పోస్టులను బట్టి అర్హతలను పేర్కొన్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు. వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
రాతపరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్వూలు కూడా ఉంటాయి. కొన్ని పోస్టులకు రాత పరీక్షలు లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వూకి పిలుస్తారు.
దరఖాస్తులు - ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం - మార్చి 18, 2024.
దరఖాస్తులకు చివరి తేదీ: 08 ఏప్రిల్ 2024(సాయంత్రం 5 గంటల లోపు పంపాలి)
అధికారిక వెబ్ సైట్ - https://www.nrsc.gov.in/
ఆన్ లైన్ దరఖాస్తు లింక్ - https://apps.nrsc.gov.in/eRecruitment_NRSC/