BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
BEL Recruitments: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్లతో పాటు ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్, సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
BEL Recruitments: కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిడెడ్ కంపెనీకి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్లాంట్లలో ఉద్యోగా భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 517 ట్రైనీ ఇంజనీర్ పోస్టులతో పాటు 29 ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ పోస్టులు, 6 సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలను కాంట్రాక్టు Contract పద్ధతిలో భర్తీ చేస్తారు.
ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. రెండేళ్ల పాటు కాంట్రాక్టు కొనసాగుతుంది. ఫీల్డ్ ఆపరేషన్ ఉద్యోగాలకు 5 నుంచి 7ఏళ్ల అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ పోస్టులకు 8ఏళ్ల అనుభవం ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపికైన వార దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
బిఇ/ బిటెక్ విద్యార్హతలు ఉన్న వారికి గరిష్ట వయో పరిమితి 28ఏళ్లు కాగా ఎంఇ, ఎంటెక్ వారికి 30ఏళ్ల పరిమితిగా నిర్ణయించారు. గరిష్ట వయో పరిమితిలో మొత్తం ట్రైనీ ఇంజనీర్ పోస్టుల్లో 210 పోస్టులు అన్ రిజర్వ్‌డ్ విభాగంలో ఉన్నాయి. ఓబీసీ విభాగంలో 139, ఈడబ్యుఎస్ కోటాలో 52, ఎస్సీ కోటాలో 77, ఎస్టీ విభాగంలో 39 పోస్టులు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల పరిధిలో 131 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
ట్రైనీ ఇంజనీర్లను రెండేళ్ల కాల వ్యవధిలో కాంట్రాక్టులో నియమిస్తారు. తర్వాత అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగిస్తారు. మొదటి ఏడాది రూ.30వేలు, రెండో ఏడాది రూ.35వేలు చెల్లిస్తారు. మూడో ఏడాది రూ.40వేలు వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక ఇలా...
బెల్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలను తర్వాత ప్రకటిస్తారు. రాత పరీక్షకు 85శాతం, ఇంటర్వ్యూకు 15శాతం మార్కులు కేటాయిస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దిగువ పేర్కొన్న లింకు ద్వారా గూగుల్ క్రోమ్ డాక్యుమెంట్‌లో తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. బెల్ రిక్రూట్‌మెంట్ లింకును దిగువ లింకు ద్వారా పొందవచ్చు. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfWbNC9vtwJ_Y2-RXsz4Pqb83Mh-q3quYiG2TaXFsJL8cNxRQ/viewform?usp=sf_link
ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. రిజిస్టర్ చేసుకోని వారిని వాక్ ఇన్ సెలెక్షన్లకు అనుమతించరు. గూగుల్ ఫాంలలో దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్టర్ చేసిన మెయిల్ ఐడికి దరఖాస్తు ఫారం మెయిల్ ద్వారా అందుతుంది.
మెయిల్ ద్వారా అందిన అప్లికేషన్ ప్రింట్ తీసి, రెండు పాస్ పోర్టులు, విద్యార్హత పత్రాలు, ఇతర ధృవీకరణలతో కలిపి వాక్ ఇన్ ఇంటర్యూలకు తీసుకు రావాల్సి ఉంటుంది. పరీక్ష తేదీ, వేదిక వివరాలను తర్వాత విడిగా ప్రకటిస్తారు.
అభ్యర్థులు దరఖాస్తుతో పాటు ఎస్‌బిఐలో రూ.150 చలాన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. మిగిలిన వారు రూ.150కు జిఎస్టీ కలిపి ఎస్‌బిఐ కలెక్ట్ లింక్ https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=14842 ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.