Army Recruitment: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు .. మార్చి 22వరకు రిజిస్ట్రేషన్.. ప్రకాశం, కడప జిల్లాల్లో ర్యాలీలు
Army Recruitment: ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌తో పాటు శారీరక సామర్థ్య పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహించనున్నారు.
Army Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనేలా ప్రోత్సహించాలని సిఎస్ ఆదేశించారు. ఈ ఏడాది నవంబర్‌లో ప్రకాశం Prakasam, కడప kadapa జిల్లాల్లో జరిగే ర్యాలీల కోసం రక్షణ శాఖ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ Rally కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్లు Registrations ప్రారంభమయ్యాయి. ఈనెల 22 వరకూ రిజిస్ట్రేషన్ మరియు ధరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆర్మీ అధికారిక వెబ్ సైట్ www.joinindianarmy.nic.in లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఏడాది ర్యాలీలను ప్రకాశం,వైయస్సార్ కడప జిల్లాల్లో నిర్వహించనున్నారు. గ్రామ స్థాయి వరకూ విస్తృత ప్రచారం చేసి అధిక సంఖ్యలో యువత పాల్గొనేలా చూడాలని సిఎస్ అధికారులకు సూచించారు.
నవంబరు నెలలో నిర్వహించే ర్యాలీలలో గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు (ఎఆర్ఓ)పరిధిలోని కృష్ణా నది కుడివైపున ఉన్న జిల్లాల యువతకు నియామకాలు చేపడతారు.
గుంటూరు జిల్లా నుంచి రాయల సీమ జిల్లాలు కలిపి 13 జిల్లాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వెల్లడించారు.
గురువారం రాష్ట్ర సచివాలయం నుండి గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ పునీత్ కూమార్,మేజర్ అమ్మీర్ దీప్ కుమార్ లతో కలిపి జిల్లా కలక్టర్లు, ఎస్పిలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, గుంటూరుల్లో రెండు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసులు ఉండగా గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసుకు సంబంధించి నవంబరులో ప్రకాశం,వైయస్సార్ కడప జిల్లాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించనున్నట్టు వివరించారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహణకు సంబంధించి ఆర్మీ అధికారులకు రెండు జిల్లాల కలక్టర్లు పూర్తిగా సహాయ సహకారాలను అందించాలని ఆదేశించారు. గుంటూరు ఎఆర్ఓ పరిధిలోని జిల్లాల్లో అర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై గ్రామ స్థాయి వరకూ పెద్దఎత్తున ప్రచారం నిర్వహించి యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కలక్టర్లు,ఎస్పిలను సిఎస్ ఆదేశించారు.ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం అందించి గ్రామ స్థాయి వరకూ పెద్దఎత్తున ప్రచారం చేయాలని చెప్పారు.
గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు అధికారి కల్నల్ పునీత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్టానది కుడివైపున గల జిల్లాలు అన్నీగుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు పరిధిలోకి వస్తాయని వచ్చే నవంబరులో ప్రకాశం, కడప జిల్లాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్టు తెలిపారు.
2024-25 ఆర్మీ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరి 13 నుండి మార్చి 22 వరకూ ఆన్లైన్ రిజిష్ట్రేషన్ మరియు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఆర్మీ అధికారిక వెబ్ సైట్ www.joinindianarmy.nic.in లో పూర్తి వివరాలు,రిజిస్ట్రేషన్, ధరఖాస్తు చేసుకునే ప్రక్రియ కొనసాగుంతోందని తెలిపారు.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక ఉంటుందని చెప్పారు. నవంబరులో ర్యాలీ నిర్వహించేందుకు ప్రతిపాదించిన ప్రకాశం,వైయస్సార్ కడప జిల్లాల్లో తగిన తోడ్పాటును అందించాలని ఆయా జిల్లాల కలక్టర్లకు ఆయన విజ్ణప్తి చేశారు. గుంటూరు ఎఆర్ఓ పరిధిలోని జిల్లాలు అన్నిటిలో గ్రామ స్థాయి వరకూ విస్తృత ప్రచారం చేసి యువత పెద్ద ఎత్తున ఈర్యాలీలో పాల్గొనేలా చూడాలని కోరారు.