Ramzan Tragedy: షాపింగ్‌కు వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ముస్లిం యువకుల దుర్మరణం
Ramzan Tragedy: రంజాన్ పండుగ వేళ వరంగల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పండుగకు దుస్తులు కొనుక్కునేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Ramzan Tragedy: పండగ షాపింగ్ కోసం వెళుతున్న యువకులు Warangal రోడ్డు ప్రమాదం Accident లో కన్ను మూశారు. సడెన్ గా వచ్చిన ఓ కారు వారు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో రక్త స్రావం జరిగి Twokilled దుర్మరణం పాలయ్యారు. దీంతో రెండు కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగాయి.
బాధిత కుటుంబ సభ్యులు, సుబేదారి పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ ట్రై సిటీ పరిధిలోని కాజీపేట జూబ్లీ మార్కెట్ ఏరియాకు చెందిన సయ్యద్ అష్రఫ్(23), మరో యువకుడు వహీద్(23) ఇద్దరూ స్నేహితులు. చిన్నతనం నుంచి ఒకే ఏరియాలో ఉంటుండటంతో ఇద్దరూ కలిసి స్థానికంగా ఐటీఐ కంప్లీట్ చేశారు.
ప్రస్తుతం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రంజాన్ పండగ సమీపించడంతో కొత్త డ్రెస్ లు కొనుక్కునేందుకు ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అష్రఫ్ తండ్రి సయ్యద్ సలీం హుస్సేన్ కు చెందిన బైక్ ను తీసుకుని బయలు దేరారు.
కాజీపేట నుంచి హనుమకొండ వెళ్లే మార్గంలో సుబేదారి సమీపంలోని వడ్డేపల్లి క్రాస్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే అదాలత్ వైపు నుంచి వడ్డేపల్లి క్రాస్ వైపు రాంగ్ రూట్ లో అతివేగంగా వచ్చిన కారు అష్రఫ్ నడుపుతున్న బైక్ ను ఢీ కొట్టింది. కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం జరగగా.. అష్రఫ్, వహీద్ ఇద్దరూ బైక్ పై నుంచి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తల, ఛాతి భాగంలో బలమైన గాయాలయ్యాయి.
చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి
కారు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అష్రఫ్, వహీద్ ను చుట్టుపక్కల వారు గమనించి వెంటనే వారిని పైకి లేపారు. అనంతరం 108 అంబులెన్స్ కు కాల్ చేసి ఇద్దరినీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తల భాగంలో తీవ్ర గాయాలు కావడం, రక్త స్రావం కూడా అధికంగా జరగడంతో ఇద్దరినీ ఐసీయూ వార్డులో అడ్మిట్ చేసి డాక్టర్ చికిత్స అందించారు.
అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో అష్రఫ్, 2.55 గంటల సమయంలో వహీద్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అష్రఫ్ తండ్రి సయ్యద్ సలీమ్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాదం చేసింది వరంగల్ నగరానికి చెందిన పోచాల సచిన్ గా గుర్తించామని, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సుబేదారి Subedari Police పోలీసులు వివరించారు.
రంజాన్ పండుగకు ఒక్క రోజు ముందే రెండు ముస్లిం కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికి అందివచ్చిన కొడుకులు అనుకోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. ఇద్దరి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించగా.. అక్కడ బాధిత కుటుంబ సభ్యులు రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: వరంగల్ పోలీసులు
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులకు వరంగల్ పోలీసులు పలు సూచనలు చేశారు. అతి వేగం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కొంతమంది ట్రాఫిక్ రూల్స్ లైట్ తీసుకుంటున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం