తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nitish Kumar: ‘‘మీ కాళ్లు పట్టుకుంటా’’ - చేతులెత్తి మొక్కుతూ ఐఏఎస్ అధికారిని వేడుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్

Nitish Kumar: ‘‘మీ కాళ్లు పట్టుకుంటా’’ - చేతులెత్తి మొక్కుతూ ఐఏఎస్ అధికారిని వేడుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్

HT Telugu Desk HT Telugu

10 July 2024, 20:34 IST

google News
  • Nitish Kumar: బిహార్ రాజధాని పట్నాలో అనూహ్య, అసాధారణ ఘటన చోటు చేసుకుంది. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా ఒక ఐఏఎస్ అధికారిని వేడుకున్నారు. చేతులెత్తి దండం పెడుతూ ఆ అధికారి కాళ్లు పట్టుకునేందుకు వెళ్లారు.

బిహార్ లో ఒక ఐఏఎస్ అధికారి కాళ్లు పట్టుకుంటానన్న సీఎం నితీశ్ కుమార్
బిహార్ లో ఒక ఐఏఎస్ అధికారి కాళ్లు పట్టుకుంటానన్న సీఎం నితీశ్ కుమార్ (Aftab Alam Siddiqui)

బిహార్ లో ఒక ఐఏఎస్ అధికారి కాళ్లు పట్టుకుంటానన్న సీఎం నితీశ్ కుమార్

Nitish kumar tries to touch the feet of an IAS officer: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, అక్కడున్న ఒక ఐఏఎస్ అధికారి కాళ్లను తాకేందుకు ప్రయత్నించారు. చేతులు జోడించి, ఆ అధికారిని వేడుకున్నారు. “కహియే తో హమ్ ఆప్కా పేర్ చు లెన్ (కావాలంటే నేను మీ కాళ్లు మొక్కుతాను)” అని రెండడుగులు ముందుకు వేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది..?

అసలేం జరిగిందంటే..?

పట్నాలో బుధవారం బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న ఒక ఐఏఎస్ అధికారితో పట్నాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. పట్నాలోని కంగన్ ఘాట్ వరకు జేపీ గంగా పథ్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆయనను కోరారు. “కహియే తో హమ్ ఆప్కా పేర్ చు లేన్ (కావాలంటే నేను మీ కాళ్లు మొక్కుతాను)” అంటూ చేతులు జోడించి, ఆ అధికారి వద్దకు వెళ్లడానికి లేచి నిలబడ్డాడు. నితీశ్ మాటలతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. ఆ అధికారి ‘‘సార్, దయచేసి ఇలా చేయకండి' అంటూ పలు అడుగులు వెనక్కి వేశారు. అనంతరం ఆ అధికారి వివరణ ఇవ్వడానికిి ప్రయత్నించగా, సీఎం నితీశ్ అడ్డుకుని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయనను కోరారు.

జేపీ గంగా పథ్ ఎక్స్ టెన్షన్ గురించి..

పట్నా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి గంగానది పక్కగా "జేపీ గంగా పథ్" అనే ఎక్స్ ప్రెస్ వే ను బుధవారం ప్రజలకు అంకితం చేసిన కార్యక్రమంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ (nitish kumar) పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోనే ఈ సంఘటన జరిగింది. అయితే, ఈ ఎక్స్ ప్రెస్ వే ను కంగన్ ఘాట్ వరకు విస్తరించే పనులను త్వరగా ప్రారంభించాలని సీఎం సంబంధిత అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం