Kerala rape case : 5ఏళ్ల చిన్నారి రేప్.. చిత్రహింసలు పెట్టి హత్య.. గోనె సంచిలో మృతదేహం!
30 July 2023, 10:25 IST
Kerala rape case : కేరళలో ఓ ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసిన ఓ వ్యక్తి, ఆమెను చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, చెత్త కుప్పల మధ్య పడేశాడు!
12ఏళ్ల బాలికను రేప్.. గోనె సంచిలో మృతదేహం.. అసలేం జరిగింది?
Kerala rape case : కేరళలో అత్యంత ఘోరమైన, హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన ఓ వ్యక్తి, ఆమెను చంపేశాడు. ఆ తర్వాత.. ఓ గోనె సంచిలో మృతదేహాన్ని కుక్కాడు. ఆ సంచిని చెత్తతో నింపు, డంప్ యార్డ్‌లో పడేశాడు!
బాలిక అదృశ్యం.. హత్య..!
కేరళలోని కొచ్చిలో శుక్రవారం రాత్రి జరిగింది ఈ ఘటన. బిహార్ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం.. గ్యారేజ్ జంక్షన్‌కు సమీపంలో నివాసముంటోంది. వారి 5ఏళ్ల బిడ్డ.. శుక్రవారం రాత్రి 7 గంటలకు హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగారు. చిన్నారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే స్థానిక సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కొద్దిసేపటికే నిందితుడు దొరికిపోయాడు!
స్థానిక మార్కెట్‌వైపు.. నిందితుడు, చిన్నారిని తీసుకెళుతుండటం సీసీటీవీ కెమెరాకు చిక్కింది. అదే రోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో.. పోలీసులు అతడిని పట్టుకున్నారు. కానీ అతడితో పాటు చిన్నారి కనిపించలేదు! నిందితుడిని విచారిద్దామని పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమైంది. మద్యం మత్తులో ఉన్న అతను.. అస్సలు మాట్లాడలేకపోయాడు.
Girl raped and killed in Kerala : మరోవైపు నిందితుడి ఐడెంటిటీని పోలీసులు తెలుసుకున్నారు. అతను కూడా బిహార్ నుంచి వచ్చిన ఓ వలస కూలీ అని తేలింది. చిన్నారి తల్లిందడ్రులు ఉంటున్న బిల్డింగ్‌లో, ఇతను మొదటి అంతస్తులో నివాసముంటున్నాడని పోలీసులు చెప్పారు.
నిందితుడు అపస్మారక స్థితిలో ఉండటంతో.. అతడిని విచారించలేకపోయిన పోలీసులు.. చిన్నారి కోసం మార్కెట్ ప్రాంతాన్ని గాలించారు. కానీ ఫలితం దక్కలేదు. శనివారం అతడిని విచారించగా.. నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడు.
"శుక్రవారం రాత్రే అతడిని పట్టుకున్నాము. కానీ మద్యం మత్తులో అతను మాట్లాడలేకపోయాడు. శనివారం అతడిని విచారించాము. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. చిన్నారిని రేప్ చేసినట్టు చెప్పాడు. కానీ దర్యాప్తును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడు," అని అధికారులు చెప్పారు.
Kerala crime news : కాగా.. శనివారం ఉదయం వరకు చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొనలేకపోయారు. ఇంతలో మార్కెట్లోని స్థానికుల నుంచి వారికి ఓ ఫోన్ వచ్చింది. వెంటనే మార్కెట్‌కు పరుగులు తీశారు అధికారులు. ఓ ట్రేడ్ యూనియన్ వర్కర్ సాయంతో చిన్నారిని ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. మార్కెట్ యార్డు వెనుక ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత కనిపించిన దృశ్యాలు చూసి, పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.
మార్కెట్ ప్రాంతం వెనుక చెత్త కుప్పలు ఉన్నాయి. వర్షం కారణంగా ఆ ప్రాంతం అంతా మట్టి, బురదతో నిండిపోయింది. అక్కడ గాలించిన అధికారులకు ఓ గొనె సంచి కనిపించింది. అందులో చెత్త బయట పడేయగా.. సంచిలో 5ఏళ్ల చిన్నారి మృతదేహం కనిపించింది.
"శుక్రవారం రాత్రి నిందితుడు ఓ చిన్నారితో అక్కడికి వెళుతండటం నేను చూశాను. సాధారణంగా మార్కెట్ వెనుకకు చాలా మంది మందు తాగడానికి వెళుతుంటారు. ఆ చిన్నారి తన బిడ్డ అని, మద్యం తాగడానికి వెళుతున్నానని, నిందితుడు నాకు చెప్పాడు. శనివారం ఉదయం నేను సీసీటీవీ ఫుటేజ్ చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చాను," అని ట్రేడ్ యూనియన్ వర్కర్ మీడియాకు తెలిపాడు.
మరోవైపు.. పోస్టుమార్టం కోసం చిన్నారి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆమెపై దారుణంగా రేప్ జరిగిందని, హత్యకు ముందు నిందితుడు చిత్రహింసకు గురిచేశాడని, చివరికి.. చిన్నారి గొంతు నులిమి చంపేశాడని పోస్టుమార్టంలో తేలింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, పడేశాడు.
రాజకీయ దుమారం..
Child raped in Kerala : ఈ ఘటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చిన్నారి అత్యాచారం, హత్యకు సంబంధించి, పోలీసులు.. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. చిన్నారిని తల్లిదండ్రులతో కలపలేకపోయామని, తాము చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు.
మరోవైపు చిన్నారి అత్యాచారం ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. విపక్ష కాంగ్రెస్, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై మండిపడింది. చిన్నారి నివాసముంటున్న చోటే, నేరం జరిగినా.. ప్రభుత్వం ఆపలేకపోయిందని, పోలీసులు ఏం చేయలేకపోయారని విరుచుకుపడింది. రాష్ట్రంలో చిన్న పిల్లలకు కూడా భద్రత, రక్షణ లేకుండా పోయిందని ఆరోపించింది.
కాంగ్రెస్ ఆరోపణలను రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఖండించారు. దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేవని, సమాచారం అందిన వెంటనే స్పందించామని స్పష్టం చేశారు.